Search This Blog

Sunday, September 20, 2026

మైండ్, మౌత్, మూడ్, మనీ, మూమెంట్స్... ఈ ఐదు M's పై కంట్రోల్ పెంచుకుంటే, మీ లైఫ్‌పై కూడా మీరు కంట్రోల్ పెరిగినట్టే.

నేను చెప్పే ఈ 5 M's ని మీరు కంట్రోల్ చేయగలిగితే, మీ లైఫ్‌లో చాలా మార్పుల్ని మీరే గమనిస్తారు. ముఖ్యంగా నాలుగో M చాలా ముఖ్యమైనది, మిస్ అవ్వకండి.
నెంబర్ 1: మైండ్ (Mind)
వచ్చే ప్రతి ఆలోచనకి మీ మనసులో చోటు ఇవ్వకండి. ప్రతి థాట్ నిజం కాదు, ప్రతి థాట్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. థాట్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
రెండవది: మౌత్ (Mouth)
మనసులో ఉన్న ప్రతి మాటని బయటకి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో సైలెన్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా కమ్యూనికేట్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకుంటే మీకు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది.
నెంబర్ 3: మూడ్ (Mood)
మూడ్ ఎలా ఉంటే అలా జీవించకండి. మూడ్ మారుతూ ఉంటది. మూడ్‌ని బట్టి అదే వాస్తవం అని భ్రమపడకండి. మీ యాక్షన్స్ మాత్రం మీ వ్యాల్యూస్‌కి తగ్గట్టు ఉండాలి తప్ప మూడ్‌ని బట్టి కాదు. నచ్చినా నచ్చకపోయినా చేయాల్సింది చేయడం నేర్చుకోండి. ఉదాహరణకు మార్నింగ్ ఎక్సర్‌సైజ్... నచ్చొచ్చు నచ్చకపోవచ్చు; పొద్దున్నే నిద్ర లేవడం... నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఏది చేయాలో అదే చేయండి.
నాలుగోది: మనీ (Money)
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా నేర్చుకోండి. మీరు సంపాదించే డబ్బు మీ జీవితాన్ని కంట్రోల్ చేయకూడదు. అది మీ కంట్రోల్‌లో ఉన్నంతవరకే మీ బంధాలు బాగుంటాయి.
ఐదవది: మూమెంట్స్ (Moments)
మీ జీవితంలో జరిగే ప్రతి మూమెంట్‌ని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని మూమెంట్స్ కేవలం మీ కోసం, మీ వాళ్ళ కోసం మాత్రమే దాచుకోండి. ఎందుకంటే ప్రైవేట్‌గా ఉన్న ప్రతి విషయం పబ్లిక్‌గా షేర్ చేయాల్సిన అవసరం లేదు.
మైండ్, మౌత్, మూడ్, మనీ, మూమెంట్స్... ఈ ఐదు M's పై కంట్రోల్ పెంచుకుంటే, మీ లైఫ్‌పై కూడా మీరు కంట్రోల్ పెరిగినట్టే.

SG
 TGARIEA WhatsApp Group 

Join Now
TGARIEATelegram Group Join Now

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top