Search This Blog

Monday, February 8, 2016

ఉల్లితో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

ఉల్లిచేసే మేలు తల్లికూడా చేయదని ఊరికే అనలేదు. ఎందుకంటే ఉల్లిపాయల్లో శరీరానికి అంతర్గతంగా.. బహిర్గతంగా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ ప్రయోజనాలు పొందడమే కాదు. వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లయ్ చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది! 

దగ్గు: ఉల్లిపాయను రెండుగా కట్‌చేసి ఒక టేబుల్‌స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లయ్ చేయాలి. ఇలా ప్రతీ లేయర్‌కు అప్లయ్ చేసిన తర్వాత రెండు భాగాలను క్లోజ్ చేయాలి. దానిని ఒక జార్లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దగ్గు తగ్గుముఖం పడుతుంది. 

జ్వరంమామూలుగా జ్వరం వస్తే ఉల్లిపాయ తింటే ఇంకా ఎక్కువవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హై బాడీ టెంపరేచర్‌ను తగ్గిస్తుంది. రెండు భాగాలుగా కట్‌చేసిన ఉల్లిపాయను సగం పాదం కింద.. మరో సంగం మరో కాలి కింద ఉంచాలి. తర్వాత సాక్సులు వేసుకొని రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్.. జబ్బులను నివారిస్తుంది. 

వాంతులు: ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసి దాంట్లో నుంచి రసాన్ని తీయాలి. ఇప్పుడు స్ట్రాంగ్‌గా పుదీనా టీ తయారుచేసి రెండు చెంచాల ఉల్లిపాయ రసాన్ని తాగాలి. 5 నిమిషాల తర్వాత రెండు చెంచాల చల్లటి పుదీనా టీ తాగి.. 5 నిమిషాల తర్వా రిపీట్ చేయాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గిపోతాయి. 

రక్తస్రావం: ఉల్లిపాయల్ని కట్‌చేసి దాని ఔటర్‌స్కిన్‌ను తెగిన గాయంపై చుట్టాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది. గాయం చుట్టూ క్రిములు చేరకుండా కూడా కాపాడుతుంది. 

చెవినొప్పి: చెవినొప్పిని.. ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో ఉల్లి బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయ పేస్ట్‌ను నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లయ్ చేసి ఆ ప్రదేశంలో క్లాత్‌తో చుట్టేయాలి. నొప్పి క్రమంగా నయమవుతుంది. 

పొట్టనొప్పిపిల్లల్లో పొట్టనొప్పిని నివారించడానికి ఉల్లి మంచి దోహదకారిగా పనిచేస్తుంది. అందుకు చేయాల్సిందల్లా ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి. ఆనియన్ వాటర్ కూల్‌గా అయిన తర్వాత ఈ వాటర్‌ను ఒక చెంచా పిల్లలకు తాగిస్తే తక్షణమే రిలీఫ్ పొందుతారు. గంటకొక్కసారి ఇస్తుంటే నొప్పి నివారించబడుతుంది. 
328

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top