Search This Blog

Monday, February 8, 2016

'బరువు తగ్గించే' ఆప్రికాట్స్...

నారింజ రంగులో ఆకర్షణీయంగా కనిపించే 'ఆప్రికాట్స్‌'లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షల మాదిరిగా ఎండు ఆప్రికాట్స్ కూడా మార్కెట్‌లో లభిస్తున్నాయి. వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. ఆప్రికాట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తాయి. దేహంలోని కణజాలాన్ని నాశనం చేసే వ్యాధి కారక ఫ్రీ ర్యాడికల్స్‌ను ఇవి అడ్డుకుంటాయి. 

2. వీటిలో విటమిన్ ఎ, సిలు అధికంగా ఉన్నాయి. ఇవి దృష్టి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. నొప్పులు, వాపులను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా వీటిలో అధికంగానే ఉన్నాయి. 
apricots
3. రోగ నిరోధక వ్యవస్థ గాడిలో పడుతుంది. చర్మం, దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆప్రికాట్స్‌లో ఉండే పొటాషియం మనకు కావల్సిన మినరల్స్‌ను అందించి శరీరంలోని ద్రవాలను నియంత్రిస్తుంది. బీపీని తగ్గిస్తుంది. 

4. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. పీచు పదార్థం వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తక్కువ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఆప్రికాట్స్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగానే వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 

5. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఆప్రికాట్స్‌లో ఉన్నాయి. క్యాన్సర్‌లలో ప్రధానంగా కనిపించే కణతులను వృద్ధి చెందకుండా చూస్తాయి.

Apricots nutrition facts and health benefits

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top