Search This Blog

Tuesday, February 9, 2016

ఒకే గొడుగు కిందకు అన్ని రకాల విద్యాసంస్థలు: సీఎం కేసీఆర్

విద్యాశాఖే సుప్రీం


 -విద్యాసంస్థలన్నీ ఒకే గొడుగు కిందకు

-విద్యావ్యవస్థ ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ నిర్ణయం


-నూతన విధానాన్ని రూపొందించాలని డిప్యూటీ సీఎం కడియం, సీఎస్ రాజీవ్‌శర్మకు ఆదేశం


-ఏయే ఉద్యోగాలకు ఎంతమంది కావాలనే అంచనా విద్యాశాఖకు ఉండాలని సూచన 
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా రంగాలు తప్ప మినహా మిగతా అన్ని రకాల, అన్ని స్థాయిల విద్యాసంస్థల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకే అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అభిప్రాయాలను సీఎం వెల్లడిస్తూ..

విద్యావ్యవస్థ అడ్డదిడ్డంగా, అస్థవ్యవస్థంగా ఉంది. పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టడీసర్కిళ్లు వేర్వేరు విద్యాసంస్థలు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయి. మైనార్టీల కోసం 60 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేసి విద్యాశాఖ నిర్వహణ నియంత్రణలో రెసిడిన్షియల్ స్కూళ్లు ఉంచాలి. ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీసర్కిళ్లు ఉన్నాయి. కార్మికశాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నయి. ఇలా ఎవరికి వారుగా విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిన్నింటిని విద్యాశాఖ గొడుకు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎవరికి వారుగా విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించింది. విద్యార్థులకు అవసరమైన విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ అందడం లేదు. దేశంలో, రాష్ట్రంలో ఏఏ ఉద్యోగ అవకాశాలున్నాయో తెలుసుకుని వాటికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే పని కూడా జరగడం లేదు. స్టేట్ పబ్లిక్ కమీషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలపై మాత్రమే ప్రభుత్వం, విద్యార్థులు దృష్టి పెడుతున్నరు. ఈ రెండే కాకుండా ఉద్యోగ అవకాశాలున్న పోటీపరీక్షలు దేశంలో అనేకం ఉన్నయి. రక్షణ, రైల్వే, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నా వాటికి సంబంధించిన సమాచారం విద్యార్థులకు అందడం లేదు. విద్యార్థులను ఆ పరీక్షల కోసం సిద్ధం చేయడం లేదు.

దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలున్న రంగాలు అనేకం పెరుగుతున్నయి. ఉద్యోగ అవకాశాలున్న రంగాలు కొత్త పుంతలు తొక్కతున్నయి. కొత్త ధోరణిలు, కొత్త అవకాశాలు వస్తున్నయి. ఐటీ రంగం విస్తరిస్తున్నది. అందులో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నయి. ఇంకా చాలా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అవసరాలకు తగిన విధంగా విద్యార్థులు కోర్సులను ఎంపిక చేసుకోవడం లేదు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఏఏ ఉద్యోగాలకు ఎంతమంది కావాలో విద్యాశాఖకు అంచనా ఉండాలి. దాని వల్ల విద్యార్థులను ఆయా ఉద్యోగాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.


గతంలో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, చాలా చోట్ల ఈ పథకం అమలు కావడం లేదు. కొన్ని రాష్ర్టాలు మోడల్ స్కూల్ ప్రతిపాదనలను తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల విషయంలోకూడా ఓ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top