Search This Blog

Tuesday, May 12, 2026

సంక్షేమ గురుకులాల్లో బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి* , బదిలీల అనంతరం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి గారికి టిగారియా రాష్ట్ర బాధ్యుల విజ్ఞప్తి

J

*పత్రికా ప్రకటన*

తేది: 12-05-2026

*సంక్షేమ గురుకులాల్లో బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలి*

బదిలీల అనంతరం ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని మంత్రి గారికి టిగారియా రాష్ట్ర బాధ్యుల విజ్ఞప్తి



*సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేసి, అనంతరం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని టిగారియా (TGARIEA) రాష్ట్ర బాధ్యులు గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కలిసి విజ్ఞప్తి చేశారు.*

*ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, జాయింట్ సెక్రటరీ స్థాయి నుండి రికార్డ్ అసిస్టెంట్ వరకు దాదాపు 1600 ప్రమోషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రమోషన్లు ఆలస్యమవడంతో అనేక మంది ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతుండగా, కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.*

*బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే సుమారు 2400 మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారని, బదిలీలు మరియు ప్రమోషన్ల ద్వారా మొత్తం 4000 మందికి పైగా గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు మే మరియు జూన్ నెలలలోనే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి గారిని కోరారు.*

*గతంలో సమర్పించిన వినతిపత్రాలపై హెడ్ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఒక ముఖ్య అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతున్నారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. సంబంధిత అధికారిని వెంటనే విధుల నుంచి తప్పించాలని కోరగా, ఈ నెల 20వ తేదీ లోపు సంబంధిత శాఖ కార్యదర్శి విధుల్లో చేరనున్నారని, అన్ని అంశాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి గారు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు.*

*ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించిన మంత్రి గారికి రాష్ట్ర బాధ్యులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే హెడ్ ఆఫీస్‌లో నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న సిబ్బందిని తిరిగి వారి స్థానాలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.*

*ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి వారం మూడు రోజులు అందుబాటులో ఉంటానని, గురుకుల వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చొరవ తీసుకుంటానని మంత్రి గారు తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో గురుకుల వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి ఉద్యోగులందరినీ ఐక్యంగా సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర బాధ్యులు మంత్రి గారికి హామీ ఇచ్చారు.*

*ఈ కార్యక్రమంలో టిగారియా రాష్ట్ర అధ్యక్షుడు అలగోని నర్సింహులు గౌడ్, జనరల్ సెక్రటరీ ఎస్. గణేష్, డిగ్రీ యూనిట్ జనరల్ సెక్రటరీ సత్య శ్రీదేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.*

       🅣︎🅖︎🅐︎🅡︎🅘︎🅔︎🅐︎
(𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐀𝐥𝐥 𝐑𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭𝐢𝐚𝐥 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞𝐬 𝐈𝐧𝐬𝐭𝐢𝐭𝐮𝐭𝐢𝐨𝐧𝐬 𝐀𝐬𝐬𝐨𝐜𝐢𝐚𝐭𝐢𝐨𝐧)








 
 TGARIEA WhatsApp Group 

Join Now
TGARIEATelegram Group Join Now

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top