1. స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం అమ్మ,
ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ,
మహోన్నతమైన మాతృమూర్తులందరికీ
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !
2. అమ్మ గొప్పతనం తెలపడానికి భాష చాలడం లేదు
కానీ చెప్పాన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మ
హ్యాపీ మదర్స్ డే !
3. అమావాస్య చీకటిలో నిండు
చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ
అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము
హ్యాపీ మదర్స్ డే !
4. అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ..
హ్యాపీ మదర్స్ డే !
5. సృష్టిలో మనకు తొలి గురువు అమ్మ
తల్లిని మించిన దైవం లేదు
ఆమె త్యాగాలకు అంతులేదు
అమ్మకు శతకోటి వందనాలు
హ్యాపీ మదర్స్ డే !
6. ప్రేమ ఎవరినైనా పంచగలరు
కానీ అమ్మ ప్రేమను ఎవరూ మరిపించలేరు
హ్యాపీ మదర్స్ డే !
7. చిన్నప్పటి నుండీ ఏ లోటు
లేకుండా చేసుకున్న
నీకు ఏమి ఇచ్చినా తక్కువే అమ్మ
హ్యాపీ మదర్స్ డే !