Search This Blog

Tuesday, May 13, 2025

హాస్టల్ విద్యార్థులకు స్మార్ట్ కార్డు వారి బ్యాంకు ఖాతాల్లోకే కాస్మెటిక్ చార్జీల జమ

 హాస్టల్ విద్యార్థులకు స్మార్ట్ కార్డు  వారి బ్యాంకు ఖాతాల్లోకే కాస్మెటిక్ చార్జీల జమ తెలంగాణ హాస్టల్ పై సంక్షేమ సమీక్ష సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసి డెన్షియల్ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించ డానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారు లను సీఎస్ కె.రామకృష్ణా రావు ఆదేశించారు. విద్యార్థుల కాస్మెటిక్ చార్జీల చెల్లింపులను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేసేందుకు తగు ప్రతిపాదన లను సిద్ధం చేయాలని సూచించారు. డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడు తుందని చెప్పారు. విద్యార్థులు తమకు కావాల్సిన కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహి స్తున్న మొబైల్ విక్రయకేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి  గృహాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వ హించారు. రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ బుక్స్, నోట్ బుక్స్ యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పెట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూ ర్చుకునేందుకు అధికా రులు ప్రతిపాదనలు  సిద్ధం చేయాలన్నారు. సరుకుల క్వాలిటీ విషయంలో రాజీపడొద్దని సీఎం ఆదేశించారని, తదనుగుణంగా అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసు కోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో ఎస్సీ డెవలప్మెంట్ ముఖ్యకార్యదర్శి ఎన్.శ్రీధర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల కార్యదర్శి ఎ వర్షిణి, సెర్ప్ సీఈవో దివ్య, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

 

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top