Search This Blog

Tuesday, September 24, 2024

సెప్టెంబర్ 28న గురుకుల టీచర్ల చలో హైదరాబాద్ధ, ర్నా పోస్టర్ ఆవిష్కరించిన యూటీఎఫ్, జేఏసీ నేతలు.


 హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీఎస్ యూటీఎఫ్, గురుకుల జేఏసీ నేతలు ప్రకటించారు.

సోమవారం మహాధర్నాకు సంంధించిన పోస్టర్​ను హైదరాబాద్ లో నేతలు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, గురుకుల జేఏసీ నేతలు మామిడి నారాయణ, ఎ. మధుసూధన్ మాట్లాడారు. రాష్ట్రంలో 1022 గురుకులాల్లో దాదాపు ఆరు లక్షల మంది చదువుతున్నారని, కానీ స్టూడెంట్లు, టీచర్లకు సరైన వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో 25 సమస్యలతో డిమాండ్స్ తయారు చేసి సర్కారు పెద్దల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. దీంతో యూటీఎఫ్, గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల12న పోరాట కార్యక్రమాల నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. అయినా, సర్కారు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రాష్ట్రంలో 70శాతం గురుకులాలు అద్దెభవనాల్లో ఉన్నాయని వివరించారు. గురుకుల ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, గురుకులాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరారు.





CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top