Search This Blog

Monday, March 25, 2024

Ragi Food: ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌‌లో రాగిజావను తాగితే మీలో వచ్చే మార్పులు ఇవే

Ragi Food: ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌‌లో రాగిజావను తాగితే మీలో వచ్చే మార్పులు ఇవే

రాగులతో ఆరోగ్యం

రాగులతో ఆరోగ్యం (Unsplash)

రాగులతో ఆరోగ్యం

Ragi Food: చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి రాగులు. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. కాబట్టి పేదవారు వీటిని తినవచ్చు. ప్రతిరోజు అల్పాహారంలో రాగులను భాగం చేసుకోండి. లేదా ప్రతిరోజూ రాగిజావ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం పై సానుకూల ప్రభావాలు పడతాయి. రోజులో తినే ఆహారాల్లో బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ముఖ్యమైన భోజనం. ఇది ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకే రాగిజావను ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

మన దేశంలో రాగులను ఫింగర్ మిల్లెట్ అని పిలుస్తారు. ఇవి దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా వినియోగిస్తారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహితమైనవి. కాబట్టి గోధుమపిండి పడని వారు రాగి పిండిని ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యం. వీటిలో ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి రాగి జావని ప్రతిరోజూ తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.

రాగుల్లో విటమిన్ సి, బీ కాంప్లెక్స్, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. ప్రతిరోజూ రాగిజావనూ తాగడం వల్ల మన శరీరానికి ఇవన్నీ అందుతాయి. అందుకే రాగులతో చేసిన ఆహారాలను కచ్చితంగా ప్రతిరోజూ తినాలి.

రాగి జావ ఎందుకు తాగాలి?

ప్రతిరోజూ రాగిజావ తాగే వారు బలంగా ఉంటారు. మానసికంగా వారు దృఢంగా ఉంటారు. వారి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలకు ఎంతో మంచిది. అస్థిపంజర వ్యవస్థను ఇది కాపాడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు కచ్చితంగా తినాల్సిన వాటిలో రాగిజావ ఒకటి. ఇది యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయోక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎవరైతే ఐరన్ లోపంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాగిజావను ప్రతిరోజూ తినాలి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, రాగి పిండితో చేసే ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది. వీరిలోనే ఎక్కువగా రక్తహీనత సమస్య కనిపిస్తూ ఉంటుంది. జీర్ణ క్రియ ఆరోగ్యం కోసం కూడా రాగులను తినాలి. ఎందుకంటే దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

బరువు తగ్గేందుకు

బరువు త్వరగా తగ్గాలనుకునే వారు రాగులతో చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీనిలో బరువు తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అధిక ఫైబర్ కంటెంట్ వల్ల రాగిజావ తాగాక పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అలాగే దీని నుండి తక్కువ క్యాలరీలు శరీరానికి అందుతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. రాగి జావ మాత్రమే కాదు రాగులతో ఇడ్లీలు చేసుకుని తిన్నా మంచిదే. లేదా దోశెల్లా వేసుకున్నా మంచిదే. అన్నిటి మీద రాగిజావ మాత్రం ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తుంది. శాకాహారులు ప్రోటీన్ కోసం రాగిజావ పై ఆధారపడవచ్చు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top