Search This Blog

Friday, March 29, 2024

మన CPS PRAN అకౌంట్ నుండి PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు.

♻️మన CPS PRAN అకౌంట్ నుండి  PARTIAL WITHDRAWAL గురించి సందేహాలు - వివరణలు.

❇️Doubts about PARTIAL WITHDRAWAL from our CPS PRAN account - explanations

❓Q1: బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ ను ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ లో చేసుకోవచ్చునా?
A: ఉద్యోగుల బ్యాంక్ డీటైల్స్ అప్డేట్  చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశం లేదు. కేవలం S2 form నింపి DDO చే సంతకం చేయించి, దానికి బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ జీరాక్స్ జతచేసి STO ఆఫీస్ నందు ఇవ్వాలి.

❓Q2) CPS ఉద్యోగులు Self declaration ద్వారా 25% పార్సియల్ withdraw చేసుకొనవచ్చునా?
A: CPS ఉద్యోగి 25% withdraw అనేది Self declaration చేసే అవకాశం ఇంకా రాష్ట్ర ఉద్యోగులకు లేదు. దీనికి సంబందించి ఎటువంటి ఉత్తర్వులు treasury అధికారులకు యివ్వలేదు.

❓Q3) ప్రస్తుతం 25% withdraw కి ఏ సందర్భం లో చేయగలరు?
A: ప్రస్తుతం CPS 25% withdraw చేయాలంటే supported document అనగా
1) Marriage purpose  లేదా
2) Home loan purpose లేదా
3) Higher education purpose of child or employee లేదా
4) Medical purpose కి సంబందించిన ఏదోఒక supported document ఉంటేనే 25% పాక్షిక ఉపసంహరణ అవకాశం ఉంది.

❓Q4) 25% withdraw time లో మన Pran account లోని మొత్తం సొమ్ములో 25% ని చెల్లిస్తారా?
A: 25% పాక్షిక ఉపసంహరణకు కేవలం Employee Contribution మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఉదా: ఒక cps ఉద్యోగి PRAN account లో Contribution amount 7 లక్షలు & gained interest on cps amount 3 లక్షలు,  మొత్తం 10 లక్షలు ఉంటే దానిలో contribution amount 7 లక్షలలో state matching grant 3.5 lakhs మినహాయించగా మిగిలిన employee 3.5 lakhs లో 25% మాత్రమే పాక్షిక withdraw కి లెక్కిస్తారు. అనగా 87500 రూ"లు. ఇప్పటి వరకు employee contribute ద్వారా వచ్చిన వడ్డీని పాక్షిక withdraw కి లెక్కించడం లేదు.

❓Q5) partial withdraw కి తప్పకుండా నింపవలసిన ఫార్మ్స్ ఏవి?
A: 25% withdraw కొరకు 601pw form నింపవలెను

❓Q 6) CPS ఉద్యోగి 25% withdraw చేయడం వలన భవిష్యత్ లో ఏమైనా సమస్య ఉందా?
A:  ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు. కానీ మీరు విత్ డ్రా చేసిన మొత్తానికి భవిష్యత్తు లో ఉద్యోగికి రాబోయే ఆదాయం ఖచ్చితంగా తగ్గుతుంది. మరీ అత్యవసరం అయితే తప్ప పార్షల్ విత్ డ్రా చేయడం వలన లాభం లేదు

❓Q 7) రిటైర్ అయిన CPS ఉద్యోగి తన అకౌంట్ లో ఉన్న మిగిలిన 40% amount total నుండి 25% withdraw చేయవచ్చునా?
A: రిటైర్ అయిన cps ఉద్యోగులకు ఎటువంటి partial withdraw సదుపాయం లేదు.

❓Q 8) 25% partial withdraw ద్వారా వచ్చిన అమౌంట్ ని ఆదాయపు పన్ను ( Income tax ) లో చూపించాలా?
A: Income tax కి చూపించనవసరం లేదు. ఇది గతంలో మనం వార్షిక returns లో చూపించిన saving amount ఇది

❓Q 9) ఒకసారి partial withdrawal చేసిన తరువాత ఎన్ని సంవత్సరాల తరువాత చేయాలి?
A: 5 సంవత్సరాల తరువాత.

❓ Q 10) Partial With Drawl వల్ల లాభామా, నష్టమా ?
A:  లాభామా, నష్టమా అనేది మనం విత్ డ్రా చేసిన తరువాత దానిని ఉపయోగించే విధానం పై ఆధార పడి ఉంటుంది. ఎప్పుడో తక్కువ రేట్ లో యూనిట్ లను మన జీతం నుండి సీపీస్ అకౌంటు లో కి కొని, ఇప్పుడు దానిని అమ్ముతున్నాము. భవిష్యత్తులో ఆ యూనిట్ ల రేట్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి మనం విత్ డ్రా చేసిన అమౌంట్ కనీసం 10% పై రాబడి ఉండే పధకాల్లో పెట్టిబడి పెడితే లాభం. లేదా మనకి అత్యవసరమనుకున్న వాటికి ఉపయోగించడానికి పర్లేదు. అంతే గానీ, అందరూ తీస్తున్నారు కదా, అని మనం విత్ డ్రా చేయడం అంటే, మనకి భవిష్యత్తు లో రాబోయే ఆదాయానికి మనమే గండి కొడుతున్నట్టు

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top