Search This Blog

Monday, July 25, 2022

High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : వీటిని రోజూ తీసుకోండి.. ఎంత‌టి హైబీపీ అయినా స‌రే.. వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో హైబీపీ స‌మ‌స్య‌తో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. బీపీని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాలి. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బీపీని కంట్రోల్ చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే అందుకు కింద తెలిపిన ఆహారాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. వీటిని రోజూ తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది. మ‌రి అందుకు ఏం చేయాలంటే..

take these foods daily to control High BP

1. నిమ్మ‌కాయ‌ల్లో సి విట‌మిన్ ఎక్కువ‌గా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మిన‌ర‌ల్స్ కూడా ఎక్కువే. ఇవి గుండెకు వెళ్లే ర‌క్త నాళాల‌ను మృదువుగా ఉండేలా చేస్తాయి. వాటిలో ఏవైనా ప‌దార్థాలు ఆగిపోయి ఉంటే వాటిని తొల‌గించేందుకు దోహ‌ద‌ప‌డుతాయి. అంతేకాదు, అధికంగా ఉన్న బీపీ కూడా నిమ్మ‌ర‌సం తాగితే వెంట‌నే త‌గ్గిపోతుంది. అందుకు ఏం చేయాలంటే ఒక క‌ప్పు గోరు వెచ్చని నీటిలో స‌గం నిమ్మకాయ‌ ముక్క‌ను పూర్తిగా పిండి అనంత‌రం ఆ నీటిని తాగాలి. దీంతో బీపీ డౌన్ అవుతుంది. దీన్ని నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగుతుంటే బీపీ క్ర‌మంగా అదుపులోకి వ‌స్తుంది.

2. గుండెకు సంబంధించిన వ్యాధుల‌ను రాకుండా చూడ‌డంలో వెల్లుల్లి అమోఘంగా ప‌నిచేస్తుంది. ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. కొవ్వు క‌రిగేలా చేస్తుంది. బీపీ నియంత్ర‌ణ‌కూ ఉప‌యోగ‌ప‌డుతుంది. నిత్యం 1, 2 వెల్లుల్లి రెబ్బ‌ల‌ను బాగా న‌లిపి ప‌చ్చిగానే తినాలి. అలా తిన‌లేని వారు వాటిని తేనెతోనూ తీసుకోవ‌చ్చు. లేదంటే ఏదైనా కూర వండాక దాంట్లో క‌లుపుకుని తిన‌వ‌చ్చు. దీంతో బీపీ త‌గ్గుతుంది.

3. పొటాషియం అధికంగా ఉండ‌డం వ‌ల్ల అర‌టిపండు బీపీని అదుపు చేయ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బీపీ బాగా ఉంటే వెంట‌నే ఒక అర‌టిపండును తినాలి. దీంతో బీపీ అదుపులోకి వ‌స్తుంది. అంతేకాదు, అర‌టిపండును నిత్యం ఆహారంతోపాటు తీసుకుంటుంటే బీపీ క్ర‌మంగా త‌గ్గుతుంది.

4. పీచు ప‌దార్థం, పొటాషియం, విట‌మిన్ సి, మెగ్నిషియం వంటి కీల‌క పోష‌కాలు ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల్లో ఉంటాయి. ఇవి గుండెకు సంబంధించిన వ్యాధుల‌ను రాకుండా చూస్తాయి. బీపీని నియంత్రిస్తాయి. నిత్యం ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే బీపీ క్ర‌మంగా త‌గ్గిపోతుంది.

5. పీచు ప‌దార్థం, పొటాషియం, మెగ్నిషియం వంటి పోష‌కాలు బీన్స్‌లో ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. బీన్స్‌ను త‌ర‌చూ తీసుకుంటూ ఉంటే బీపీ త‌గ్గుతుంది.

6. హైబీపీ ఉన్న‌వారు త‌మ శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందుకోసం వారు నిత్యం క‌నీసం 10 గ్లాసుల నీటినైనా తాగాలి. అయితే నీరు అందుబాటులో లేక‌పోతే కొబ్బ‌రి నీళ్లు అందుకు ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేస్తాయి. ఎందుకంటే పొటాషియం, మెగ్నిషియం, విట‌మిన్ సి వంటి పోష‌కాలు ఉన్నందున కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే శ‌రీరానికి నీరు అంద‌డ‌మే కాదు, హై బీపీ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది.

7. బీపీని నియంత్రించ‌డంలో పుచ్చ‌కాయ విత్త‌నాలు కూడా అద్భుతంగా ప‌నిచేస్తాయి. ప‌లువురు సైంటిస్టులు దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా నిరూపించారు కూడా. కొన్ని పుచ్చ‌కాయ విత్త‌నాల‌ను సేక‌రించి నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేయాలి. అనంత‌రం అంతే మొత్తంలో గ‌స‌గ‌సాల‌ను తీసుకుని పొడి చేసుకోవాలి. ఈ రెండింటినీ బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని నిల్వ చేసుకోవాలి. దీన్ని ఉద‌యం, సాయంత్రం భోజనానికి ముందు 1 టీస్పూన్ చొప్పున తీసుకుని నీటిలో క‌లిపి తాగాలి. దీంతో బీపీ అదుపులోకి వ‌స్తుంది.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top