Search This Blog

Tuesday, July 26, 2022

Google Meet | ఇక యూట్యూబ్‌లో ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్‌!!

Google Meet | ఇక యూట్యూబ్‌లో ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్‌!!

Google Meet | ఇక యూట్యూబ్‌లో ఆన్‌లైన్ మీటింగ్స్ లైవ్ స్ట్రీమింగ్‌!!

టెక్ దిగ్గజం గూగుల్ తన మీట్ యాప్‌కి కొత్త ఫీచర్‌ను జోడించింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌లో మీటింగ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసుకునేలా యూజ‌ర్ల‌కు అనుమ‌తించింది. అడ్మిన్‌.. మీటింగ్ యాక్టివిటీ ప్యానెల్‌కు నావిగేట్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీటింగ్‌ను ప్రారంభించొచ్చు. ఈ ఆన్‌లైన్ స‌మావేశం కోసం యూజ‌ర్స్ ఛానెల్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంద‌ని ఆండ్రాయిడ్ సెంట్రల్ నివేదించింది.

‘యూజ‌ర్స్‌.. తమ సంస్థ వెలుపల ఎక్కువ మంది ప్రేక్షకులకు సమాచారాన్ని అందించాలనుకునే సందర్భాల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉపయోగకరంగా ఉంటుంది. వారికి అవసరమైన విధంగా పాజ్ చేయడానికి, రీప్లే చేయడానికి లేదా తర్వాత సమయంలో వీక్షించేందుకు వీలు కల్పిస్తుంది’ అని గూగుల్ వివరించింది. యూట్యూబ్‌లో గూగుల్ మీట్ లైవ్ మీటింగ్ కోసం చాన‌ల్ క‌చ్చితంగా అప్రూవ్ అయి ఉండాల‌ని గూగుల్ పేర్కొంది. అప్పుడే లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకోవ‌చ్చ‌ని తెలిపింది. హోస్ట్ మేనేజ్‌మెంట్ ఆన్‌లో ఉంటే హోస్ట్, కో హోస్ట్‌లు మాత్రమే సమావేశం ప్రత్యక్ష ప్రసారం ప్రారంభించొచ్చు. ఒక‌వేళ ఈ ఆప్ష‌న్ ఆఫ్‌లో ఉంటే మీటింగ్‌కు హాజరయ్యే ఎవరైనా లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రారంభించొచ్చు.

Also Read:

TSWREIS

DONATION FOR TGARIEA.IN

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top