Search This Blog

Friday, April 8, 2022

IDRBT Hyderabad Jobs 2022: నెలకు లక్ష జీతంతో హైదరాబాద్‌ ఐడీఆర్‌బీటీలో కొలువుల జాతర.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

IDRBT Hyderabad Senior Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (IDRBT).. సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల (Senior Project Engineer posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 23

పోస్టుల వివరాలు:

సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 3 విభాగాలు: డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్ టెక్నాలజీ అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
సీనియర్ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 9 విభాగాలు: ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌/మెషిన్‌ లెర్నింగ్‌ అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ పోస్టులు: 7 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.1,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
టెక్నికల్‌ సపోర్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 1 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్‌ టెక్నిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 2 అర్హతలు: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్‌ అడ్మినిస్ట్రేటి అసిస్టెంట్‌ పోస్టులు: 1 అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పే స్కేల్‌: నెలకు రూ.27,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సెలక్షన్ ప్రాసెస్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.

ఈ మెయిల్‌ ఐడీ: vkycproject@idrbt.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25, 2022.



TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top