వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.
నేరేడు పండు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని పెంచుతాయి. నేరేడు పండ్లు తింటే రక్తపోటు తగ్గుతుంది. పిస్తా ఒక డ్రై ఫ్రూట్. దీనిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పిస్తాలో పొటాషియం, వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయి.