*🍃🥀జీవితం అంటే ఏమిటి❓*
*🍃🥀ఏదో కోల్పోయినట్లు దిగాలుగా మొహాలు పెట్టుకుని చాలామంది బ్రతికేస్తున్నారు. తల మీద గ్లోబ్ మోస్తున్నట్లు! తిప్పి తిప్పి కొడితే పదిరోజులు పనిలో పడితే మర్చిపోయే సమస్యలు.. ఓ ఏదో జీవితాలు జీవితాలు చేతిలోంచి జారిపోయినంత ఫీలింగ్.*
*🍃🥀జీవితం ఎక్కడికీ పోలేదు. నీ చేతిలోనే ఉంది. నవ్వకుండా మూతి బిగించుకుని బ్రతికేద్దామని నువ్వే ఫిక్సయిపోయావు. నువ్వనుకుంటున్న సమస్యలన్నీ 90 శాతం ఊహ మాత్రమే. నీ మీద నువ్వు సింపతీ పెంచుకుంటూ.. తెగ కష్టాలు వచ్చినట్లు బాధపడిపోతూ పెద్దవిగా మైక్రోస్కోప్‌లో చూసుకునేవి మాత్రమే. మిగలిన 10% మాత్రమే వాటి పరిధి. ఎక్కువ ఆలోచించకు. ఈ మాట చాలామందే నీకు చెప్పి ఉంటారు... "నీదేం పోయింది.. కష్టం నాది కదా.. బానే చెప్తావు" అని ఓ విరక్తి నవ్వు నవ్వుకుని మళ్లీ ఆకాశంలోకో, నేలమీదకో చూస్తూ బాధపడడం మొదలు పెట్టి ఉంటావు.*
*🍃🥀ఈ భూమ్మీద పుట్టింది సంతోషంగా బ్రతకడానికి! ఈ క్షణం మాత్రమే వాస్తవం. ఈ క్షణం నువ్వు గట్టిగా ఊపిరి పీల్చగలుగుతున్నావు.. కడుపు నిండా తిన్నావు.. భూమ్మీద బ్రతికి ఉన్నావు.. ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా ఉండాలనుకుంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఆలోచించే విధానమే మారిపోతుంది. కానీ నువ్వు బాధపడుతూ కూర్చోవాలనుకుంటున్నావు..*
*🍃🥀ఒక్కసారి అన్నీ మర్చిపోయి ఈ క్షణంలో బ్రతుకు... నీ పుట్టుకా లేదు.. నీ చావూ లేదు. నీ చుట్టూ మనుషులు లేరు... వారి స్వార్థాలు లేవు.. వారు చేసిన గాయాలు లేవు.. వారు పంచిన ప్రేమా లేదు... ఆ ప్రేమతో పాటు వచ్చిన విరహం.. బాధా, మిస్ అవడం.. వంటివేమీ లేవు. నీ కళ్లెదురు ఉన్నదే ప్రపంచం. అంతకన్నా ఎక్కువ ఆలోచించకు. ఏ పని చేసినా ఆ పని వరకూ మాత్రమే ఆలోచించు. ఇంకెక్కడి నుండి వస్తాయో బాధలు చూద్దాం?*
*🍃🥀ప్రపంచంలో 90 శాతం బాధలు మన కల్పితాలు. కడుపు నిండా తిని ఏదో ఒక లోటు ఫీలవ్వకపోతే.. బుర్ర చించుకోపోతే నచ్చక.. మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవడం మనస్కరించక అక్కడక్కడ ఏరుకొచ్చిన సమస్యలు... పక్కోడు ఎదిగిపోతుంటే సమస్య.. ఇంట్లో పనిమనిషి రాకపోతే సమస్య.. ఆఫీసులో రాజకీయాలు చూసి సమస్యా.. ఉద్యోగం రాకపోతే సమస్యా... సేలరీ హైక్ రాకపోతే సమస్య.. ఇన్ని సమస్యల మధ్య ఈ బ్రతుకేంటి.. నా వల్ల కావట్లేదు అని నీ మీద నువ్వు జాలిపడడం కావాలి. ఫ్రస్టేట్ అవడం కావాలి. అలాంటి జాలిని విస్సిరి కొట్టు.*
*🍃🥀ఇన్నేళ్లు వచ్చాయి.. ఇంత బ్రతుకు బ్రతికావు.. ఇంత చదువుకున్నావు.. ప్రపంచంలో దేని గురించైనా అనర్గళంగా మాట్లాడగలుగుతావు.. నీ మీద నువ్వు జాలిపడడానికి సిగ్గేయట్లేదా? నీ సమస్యని చూసి అక్కడక్కడే తిరుగుతూ సంతోషాన్ని దూరం చేసుకోవడం సిగ్గనిపించట్లేదా?*
*🍃🥀యెస్... నువ్వు సంతోషంగా ఉండడానికే ఈ భూమ్మీదకొచ్చావు. ఉన్నన్నాళ్లూ నువ్వూ సంతోషంగా ఉండు... నీ చుట్టూ ఉన్న వాళ్లనీ హాపీగా ఉంచు. ఎప్పుడూ దిగాలు ఫేస్ పెట్టుకుని చూసే వాళ్లకీ నీరసం వచ్చేలా.. గట్టిగా గాలి తోలితే ఎగిరిపోయేలా ఊగులాడుతూ నడవకు... నీరసంగా బ్రతక్కు. మాటల్లో, కళ్లల్లో, ఆలోచనల్లో, పనుల్లో ఎనర్జీ.. సంతోషం ఉట్టిపడాలి.*
*🍃🥀లే.. జీవితాన్ని నీ కంట్రోల్‌లోకి తీసుకో.. ఈ క్షణం నుండే! యెస్.. ఈ క్షణం నీదే.. నిన్నో, రేపో నీ కంట్రోల్‌లో లేకపోవచ్చు.. ఖచ్చితంగా ఈ క్షణం నీదే. గట్టిగా ఊపిరి పీల్చుకో.. జీవితం గెలిచినంత ఉత్సాహం వస్తుంది శరీరంలో!!*
*శుభ సాయంత్రం*🙏