Search This Blog

Friday, April 19, 2019

కోశాగారాల్లో ఓటీపీ ఆధారంగా బిల్లుల నిర్వహణ*

🔊💰 *కోశాగారాల్లో ఓటీపీ ఆధారంగా బిల్లుల నిర్వహణ*
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

♦ *ప్రతి ఉద్యోగి లెక్క. పక్కాగా ఉండేలా బాధ్యత డీడీ వోలదే*

🖥 *ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చిన ఖజానాశాఖ*

🏆🌅 *'ఈనాడు' డిజిటల్ హైదరాబాద్*
_____________________________✍
🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲🔲

🌸 *ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి వేతన, ఇతర రకాలైన కోశాగార చెల్లింపుల్లో తప్పుడు బిల్లులు సమర్పించినా.. వేతనాల్లో హెచ్చు తగ్గులు, సెలవులకు సంబంధించిన వివరాల్లో పొరపాట్లు జరిగినా వీటన్నింటికీ ఇక నుంచి పూర్తి బాధ్యత డీడీవో (డ్రాయింగ్‌ డిస్బర్సింగ్‌ అధికారులు)లే వహించాల్సి ఉంటుంది. అన్ని రకాల బిల్లులు, చెల్లింపులు ఇక నుంచి ఓటీపీ ఆధారంగానే నిర్వహించేలా ఖజానాశాఖ ‘ఐఎఫ్‌ఎంఐఎస్‌’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.*

🍥 *ఈ విధానంతో అక్రమాలకు చెక్‌ పెట్టడంతో పాటు జిల్లాలోని కోశాగారాల్లో కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టనున్నారు.*

🖥 *జిల్లాలో ఇదీ పరిస్థితి :*

📘  *మహబూబ్‌నగర్‌లో జిల్లా కోశాధికారి, జడ్చర్ల, నారాయణపేట, మక్తల్‌, కోస్గిలో ఉప కోశాగార కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 11,803 మంది ఉద్యోగులు ఉన్నారు. మరో 10వేల మంది వరకు విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించి కాగిత బిల్లులు కార్యాలయంలో సమర్పిస్తే.. ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఈ- కుబేర్‌ ద్వారా వేతనాలు, పింఛను చెల్లిస్తున్నారు. తాజాగా వచ్చిన విధానంతో ఆన్‌లైన్‌లోనే బిల్లుల సమర్పణ, చెల్లింపులు ఉండనున్నాయి. దీంతో కాగిత బిల్లులకు పూర్తిగా కాలం చెల్లనుంది.*

⬛ *అందుబాటులోకి పోర్టల్‌ :*

🌎  *కొత్తగా రూపొందించిన ఐఎఫ్‌ఎంఐఎస్‌ (ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్సియల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) పోర్టల్‌లో డీడీవోలకు ప్రత్యేకంగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ కేటాయిస్తారు. రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ ఆధారంగా దీనిలో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టల్‌లో డీడీవోలు మొదట తమ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలతో సబ్‌ట్రెజరీ, జిల్లా కోశాగార కార్యాలయాల్లో సంప్రదించాలి. అక్కడ ఎస్‌ఎల్‌వోల వద్ద ఆ వివరాలన్నీ సక్రమమేనని ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఉద్యోగి పూర్తి పేరు, ప్రస్తుతం పనిచేస్తున్న చోటు, మొదటి పోస్టింగ్‌ ఎక్కడ.. గతంలో ఎక్కడ పనిచేశారు? పదోన్నతులు పొందితే ఆ వివరాలు, ఇలా అన్ని రకాలైన అంశాలను ఎస్‌ఆర్‌ ఆధారంగా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు పాన్‌కార్డు, ఆధార్‌ వివరాలు తప్పనిసరి. పూర్తి చేసిన వివరాలను పునః పరిశీలన అనంతరం ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో నివేదించాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి ఉద్యోగుల పూర్తి వివరాలు నమోదు చేస్తే వచ్చే నెల జీతాలు అందుతాయి. ప్రస్తుతం వినియోగిస్తున్న సాప్ట్‌వేర్‌లో ఆన్‌లైన్‌ బిల్లులు చేశాక.. హార్డ్‌ కాఫీలను ఖజానా కార్యాలయంలో సమర్పిస్తున్నారు. కొత్త విధానం అమలు అయితే ఇక హార్డ్‌ కాపీల సమర్పణ ఉండబోదు.*

🖥📃 *ఉద్యోగి వివరాలు నమోదు చేయాలి :*

🔘  *జిల్లాలోని ఉద్యోగుల వివరాలు నిశిత పరిశీలన చేసి సర్వీసు పుస్తకం ఆధారంగా ప్రతి ఉద్యోగి వారి వివరాలు ఐఎఫ్‌ఎంఐఎస్‌లో నమోదు చేయాలి. అన్ని రకాలైన పీడీ అక్కౌంట్స్‌కు సైతం ఇదే వర్తిస్తుంది. కేవలం కోర్టు పరిధిలో పనిచేస్తున్న వారికి మాత్రమే మినహాయింపు ఉంది. ఈ నెల చివరి కల్లా డీడీవోలు ఉద్యోగుల వివరాలు కొత్త పోర్టల్‌లో నమోదు చేస్తేనే వచ్చే నెల వేతనాలు అందుతాయి. ఏవైనా సందేహాలుంటే ‘ఐఎఫ్‌ఎంఐఎస్‌’ పోర్టల్‌ ఓపెన్‌ చేస్తే ట్యుటోరియల్‌-1, ట్యుటోరియల్‌-2లో బిల్లులు ఎలా చేయాలనే విషయాలు అందుబాటులో ఉంటాయి.*

🖥🖥🖥🖥🖥🖥🖥🖥🖥🖥🖥

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top