*సందేహాలు -సమాధానాలు:*
*👉 చైల్డ్ కేర్ లీవ్....*
*1) సందేహము:*
చైల్డ్ కేర్ లివ్ ఒక స్పెల్ కు మాగ్జిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు. 1,2 రోజులు కూడా పెట్టుకోవచ్చునా ?
*సమాధానము:*
*G.O.Ms.No.209 Fin తేది:21.11.2016* *ప్రకారంవివాహిత మహిళా ఉపాధ్యాయులు ప్రతి స్పెల్ కు మాగ్జిమం 15 రోజుల చొప్పున 6 స్పెల్ లకు తగ్గకుండా 90 రోజులు వాడుకోవచ్చును* *జీవోలో 6 స్పెల్ లకు తగ్గకుండా అన్నారు కాబట్టి 1, 2 రోజులు కూడా వాడుకొనవచ్చును.*
********
*2) సందేహము:*
చైల్డ్ కేర్ లివ్ ముందుగానే మంజూరు చేయించుకోవాలా? సెలవు కాలంలో పూర్తి జీతం చెల్లిస్తారా ?
*సమాధానము:*
*చైల్డ్ కేర్ లివ్ ను DDO తో ముందుగానే మంజూరు చేయించుకుని, ప్రొసీడింగ్స్ ద్వారా వివరాలను సర్వీసు పుస్తకములో నమోదు చేయించుకోవాలి.ఆ నెల వేతనాన్ని యధావిధిగా మంజూరు చేయాలసీన బాధ్యత DDO దే.*
******
*3) సందేహము:*
చైల్డ్ కేర్ లివ్ పెట్టిన సెలలో ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే మంజూరు చేయవచ్చునా ?
*సమాధానము:*
*వీలుపడదు. సెలవు కాలంలో వేతన వృద్ధి ఉండదు.కావున సెలవు అనంతరం విధులలో చేరిన నాటినుండే ఇంక్రిమెంట్ మంజూరుచేస్తారు.*
*******
*4) సందేహము:*
మెటర్నిటి లీవుకు కొనసాగింపుగా చైల్డ్ కేర్ లీవు పెటుకోవచ్చునా ?
*సమాధానము:*
*చైల్డ్ కేర్ లీవును అన్ని విధాలుగా Other than casual, spl. casual leave తో కలిపి పెట్టుకోవచ్చునని జీవో.209 లోని రూలు 3(i) సూచిస్తోంది.*
*******
*5) సందేహము:*
సర్రోగసి, దత్తత ద్వారా సంతానం పొందిన మహిళా ఉద్యోగులు చైల్డ్ కేర్ లివ్ కు అర్హులేనా ?
*సమాధానము:*
*అర్హులే, 90 రోజుల సెలవు వాడుకొనవచ్చును*
******
*6) సందేహము:*
భార్య మరణించిన పురుష ఉద్యోగికి చైల్డ్ కేర్ లివ్ మంజూరు చేయవచ్చునా ?
*సమాధానము:*
*వీలు లేదు. ఇందుకు సంబంధించిన GO.209 లో "Women Employees" అని ఉన్నది.*
*****
*7) సందేహము:*
చైల్డ్ కేర్ లీవ్ కు అప్లై చేసిన ప్రతిసారి పుట్టినతేది వివరాలు సమర్పించాలా?
*సమాధానము:*
*అవసరం లేదు. మొదటి సారి అప్లై చేసేటపుడు మాత్రమే కుమారుడు/కుమార్తె డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పించాలి. ప్రతి దఫా అప్లికేషన్ సమర్పిస్తే సరిపోతుంది.*
********
*8) సందేహము:*
పిల్లల అనారోగ్యం, చదువుల కొరకు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ మంజూరుచేస్తారా ?
*సమాధానము:*
*GO.209 point.3 లో ఇలా ఉన్నది "Children needs like examinations, sickness etc", అని ఉన్నది కావున పై రెండు కారణాలకే కాకుండా ఇతరత్రా కారణాలకు కూడా చైల్డ్ కేర్ లీవు మంజూరు చేయవచ్చును.*
******
*9) సందేహము:*
చైల్డ్ కేర్ లీవ్ కు ప్రిఫిక్స్ , సఫిక్స్ వర్తిస్తాయా ?
*సమాధానము:*
*వర్తిస్తాయి, ప్రభుత్వ సెలవు దినాలతో ఇట్టి సెలవును అనుసంధానం చేసుకోవచ్చును.*
~~~~~~~~
.