*💵 పన్ను ఆదా చేసుకోండి*
*వేతన జీవులకు దగ్గర పడిన గడువు*
వేతనాలపై జీవనం సాగించే వారికి వివిధ రకాల పన్ను ఆదా పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వారు తమ పన్ను భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ఆదాయపు పన్ను రాబడి పరిధిలోకి వచ్చే ప్రతీ ఒక్కరూ పన్ను ఆదా కోసం తాము చేసే పెట్టుబడుల వివరాలు యాజమాన్యాలకు అందించాల్సిన సమయం ఇదే.
పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడుల వివరాలు ప్రకటించే సమయానికి ప్రతి ఒక్కరికీ గరిష్ఠంగా పన్ను ఆదా చేసుకునేందుకు ఏయే అవకాశాలున్నాయో తెలిసి ఉండాలి. ఇవి తెలిసి ఉన్నట్టయితే ప్రతీ ఒక్క విభాగంలోనూ గరిష్ఠంగా ప్రయోజనం పొందగల విధంగా ఇన్వెస్ట్ చేసి అధికంగా పన్ను ఆదా చేసుకోగలుగుతారు.
కొన్ని రకాల అలవెన్సులు, వ్యయాలపై కూడా వేతన జీవులకు పన్ను ఆదా కల్పిస్తున్నారు.
*🔴పన్ను ప్రయోజనాలు -పెట్టుబడి ఉపకరణాలు*
*♈ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ):* అద్దె ఇంటిలో నివసిస్తున్న ఉద్యోగులందరికీ ఈ అలవెన్సు వర్తిస్తుంది.
ఏ) కంపెనీ నుంచి అందిన వాస్తవ హెచ్‌ఆర్‌ఏ;
బీ) వేతనంలో 40 శాతం (మెట్రో నగరాల్లో 50 శాతం),
సీ)వేతనంలో బేసిక్, డిఏ, టర్నోవర్ ఆధారిత కమీషన్ భాగంగా ఉన్నట్టయితే ఇంటి యజమానికి అందిస్తున్న వాస్తవ అద్దె నుంచి వేతనంలో పది శాతం మైనస్ చేయగా వచ్చే మొత్తం ఈ మూడింటిలో ఏది వర్తిస్తే దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది.
*☸పిల్లల విద్య అలవెన్సు:*
గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరిపై నెలకు రూ.100 వంతున మినహాయింపు కల్పిస్తున్నారు.
*🅾హాస్టల్ వ్యయాల అలవెన్సు:*
గరిష్ఠంగా ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరిపై నెలకి రూ.300 వంతున మినహాయింపు కల్పిస్తున్నారు.
*✡ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్సు: ప్రభుత్వోద్యోగులకు..*
ఏ) కనీసం రూ.5,000
బీ) వేతనంలో ఐదో వంతు
సీ) వాస్తవంగా వినోదం కోసం చేసిన వ్యయం ఈ మూడింటిలో ఏది వర్తిస్తే దానిపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇతర ఉద్యోగులకు దీనిపై పూర్తిగా పన్ను విధిస్తారు.
*♉స్టాండర్డ్ డిడక్షన్ :* కనీసం రూ.40 వేలు లేదా వేతనం
*☯ఇంటి రుణంపై వడ్డీ :* ఇంటి రుణంపై చెల్లించే వడ్డీకి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంది.
*🌐కొత్త పింఛను స్కీమ్‌లో (ఎన్‌పీఎస్) పెట్టే పెట్టుబడి :* ఎన్‌పీఎస్ నిర్బంధం, స్వచ్ఛందమనే రెండు భాగాలుగా ఉంటుంది.
*♈ఉద్యోగులు చట్టబద్ధంగా అందించి తీరాల్సిన వాటా :* ఇదే నిర్బంధ ఎన్‌పీఎ్‌సగా పరిగణనలోకి వస్తుంది. ఈ విభాగం కింద ఇన్వెస్ట్ చేసే మొత్తంలో గరిష్ఠంగా ఏడాదికి లక్షన్నర రూపాయలు లేదా ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా చెల్లించిన మొత్తం ఏది తక్కువైతే దానిపై 80సితో అనుసంధానమైన 80 సిసిఇ సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది.
*☸స్వచ్ఛందంగా చెల్లించే వాటా :* చట్టబద్ధంగా ఇన్వెస్ట్ చేసే వాటాకు పైబడి స్వచ్ఛందంగా జమ చేసే వాటాపై ఒక ఆర్థి క సంవత్సరంలో గరిష్ఠంగా రూ.50 వేలకు 80సీ సెక్షన్‌తో అనుసంధానమైన 80సిసిడి కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
*🛑ప్రావిడెండ్ ఫండ్‌కు అందించే వాటా పెట్టుబడి :*
ఇది మూడు రకాలుగా ఉంటుంది.
ఏ) ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు వర్తింపచేసే గుర్తింపు పొందిన ప్రావిడెండు ఫండ్
బీ) జీపీఎఫ్‌గా వ్యవహరించే చట్టబద్ధమైన ప్రావిడెండ్ ఫండ్
సీ) గుర్తింపు లేని ప్రావిడెండ్ ఫండ్.
*⛔ఉద్యోగుల వాటా :* వేతనంలో భాగంగా ఉండే బేసిక్ పే, డిఏ, టర్నోవర్ ఆధారిత కమీషన్ మూడింటినీ కలిపితే వచ్చే మొత్తంలో 12 శాతం వాటాకు పన్ను మినహాయింపు ఉంటుంది.
*🕎యాజమాన్యం వాటా* : గుర్తింపు లేని ప్రావిడెండ్ ఫండ్‌లను మినహాయించి ఉద్యోగుల పీఎఫ్‌కు యాజమాన్యాలు అందించే వాటాకు 80 సి సెక్షన్ కింద మినహాయింపు ఉంటుంది.
*✝పీ ఎఫ్ కు జమ చేసిన వడ్డీ మొత్తం :* గుర్తింపు పొందిన ప్రావిడెండ్ ఫండ్లలో పెట్టిన సొమ్ముపై వచ్చే వడ్డీరాబడిలో 9.5 శాతానికి ఆదాయపు పన్ను రాయితీ ఉంటుంది. చట్టబద్ధమైన పీఎఫ్ సంస్థలు, గుర్తింపు లేని పీఎఫ్ సంస్థల్లో పెట్టే పెట్టుబడికి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
*🔵80డీ సెక్షన్ కింద మినహాయింపులు*
సొంతానికి, భార్య, తమపై ఆధారపడిన సంతానం కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై నగదు మినహా ఏ ఇతర విధానంలో చేసే చెల్లింపునకైనా రూ.25 వేలు లేదా భార్యాభర్తలిద్దరూ సీనియర్ సిటిజన్‌లై ఉంటే రూ.50 వేలకు మినహాయింపు ఉంది. అలాగే తల్లిదండ్రుల కోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25 వేలు లేదా సీనియర్ సిటిజన్లయితే రూ.50 వేలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వోద్యోగులైతే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకానికి చేసే చెల్లింపులు, పివెంటివ్ హెల్త్ చెకప్ కోసం చేసే వ్యయంలో రూ.5,000 మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంది.
*🔴80ఈ :* పూర్తి కాలపరిమితికి చెందిన (ఫుల్ టైమ్) గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీకి (అసలుకు వర్తించదు) ఈ సెక్షన్ మినహాయింపు ఇస్తుంది.
*⛎80జీ*: దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంద సహాయ సంస్థలకు ఇచ్చే విరాళాలపై ఆ సంస్థ స్వభావాన్ని బట్టి 50 శాతం నుంచి నూరు శాతం మొత్తంపై పన్ను మినహాయింపు ఉంటుంది. పలు విరాళాల విషయంలో స్థూల ఆదాయంలో 10 శాతం మించకుండా ఇచ్చే మొత్తం పైనే ఇది వర్తిస్తుంది.
*☯80సీ సెక్షన్ కింద మినహాయింపులు*
పాలసీదారు వారి భార్య/భర్త, పిల్లల కోసం చేసే బీమా మొత్తంలో పది శాతం మొత్తంపై చెల్లించే ప్రీమియం
పెన్షన్ ప్లాన్లు, డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్లు, యులిప్‌లలో పెట్టిన పెట్టుబడి
ప్రభుత్వోద్యోగులైతే తన కోసం తీసుకునే డిఫర్డ్ యాన్యువిటీ ప్లాన్, భార్య, పిల్లల కోసం చేసే కేటాయింపులపై వారికి చెల్లించే వేతనంలో 20 శాతానికి లోబడి
ఇంటి రుణం పొందిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు ఇల్లు ఉద్యోగి చేతికి వచ్చిన కేసుల్లో ఇంటి రుణంపై చెల్లించే అసలు
పైన చర్చించిన విధంగా ఇపీఎ్‌ఫకు చెల్లించే వాటా
ఇద్దరు పిల్లల పరిమితికి లోబడి ప్రతీ ఆర్థిక సంవత్సరంలోను చెల్లించే ట్యూషన్ ఫీజు (డెవల్‌పమెంట్ ఫీజు, డొనేషన్ మినహా)
స్వయంగాను, భార్య, పిల్లల కోసం చేసే పీపీఎఫ్ పెట్టుబడి
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి
ఐదేళ్ల పోస్టల్ డిపాజిట్‌కు చేసిన పెట్టుబడి
షెడ్యూల్డు బ్యాంకుల్లో 5 ఏళ్ల కాలపరిమితి గల ప్రకటిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టిన పెట్టుబడి
ఈఎల్‌ఎస్ఎస్ లేదా ఏదైనా అధీకృత సూపర్ యాన్యువేషన్ ఫండ్‌లో పెట్టే పెట్టుబడి
ఇద్దరు కుమార్తెల పరిమితికి లోబడి సుకన్య సమృద్ధి యోజనలో పెట్టే పెట్టుబడి
5ఏళ్ల కాలపరిమితి గల వయోవృద్ధుల పొదుపు పథకం (ఎస్‌సిఎస్ఎస్)
*⭕మరిన్ని మార్గాలు..*
పైన పేర్కొన్న పన్ను ఆదా సాధనాలు కాకుండా అంతగా తెలియనివి కూడా మరి కొన్ని ఉన్నాయి.
*పిల్లల ప్రీ నర్సరీ ఫీజులు :* ఇద్దరు పిల్లల పరిమితికి లోబడి ప్లేగ్రూప్, ప్రీ నర్సరీ, నర్సరీ క్లాసులకు చెల్లించే ఫీజులపై 80 సి సెక్షన్ కింద మినహాయింపు ఉంది. ఈ విభాగం కింద లక్షన్నర రూపాయల పరిమితికి లోబడి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.
*స్టాంప్ డ్యూటీ*: కొనుగోలు చేసిన ఇంటిపై చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ర్టేషన్ ఫీజు రెండింటికీ 80సి సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. గరిష్ఠంగా లక్షన్నర రూపాయల వరకు మినహాయింపును అనుమతిస్తారు. ఇవి ఏ ఆర్థిక సంవత్సరంలో చేసే ఆ సంవత్సరంలోనే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. తదుపరి సంవత్సరంలో క్లెయిమ్ అవకాశం ఉండదు.
*తల్లిదండ్రులకు చెల్లించే వడ్డీ*: బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థల నుంచి ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న రుణం పైనే కాకుండా తల్లిదండ్రుల నుంచి ఏమైనా సొమ్ము రుణంగా పొందగలిగితే దానిపై వారికి చెల్లించే వడ్డీకి కూడా 24 బి సెక్షన్ కింద గరిష్ఠంగా రెండు లక్షల రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు.
*తల్లిదండ్రులకు చెల్లించే అద్దె*: తల్లిదండ్రులు యజమానులుగా ఉన్న ఇంటిలోనే అద్దెకుంటున్నట్టయితే దానికి చెల్లించే అద్దెపై కూడా 10 (13ఏ) సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే దీన్ని డాక్యుమెంట్ చేయించాల్సి ఉంటుంది. అద్దెకు ఉంటున్న వారు దీనికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందితే అద్దె తీసుకుంటున్న తల్లిదండ్రులు వారు చెల్లించే మునిసిపల్ పన్నులకు మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ కూడా వర్తిస్తుంది. ఆ రకంగా కుటుంబం మొత్తానికి ఆదా అవుతుంది.
*☮గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం :*
యాజమాన్యాలు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో ఉద్యోగి తనకు, భార్యా పిల్లలకు చెల్లించే ప్రీమియంపై 80డీ సెక్షన్ కింద గరిష్ఠంగా రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
*⛎తల్లిదండ్రుల వైద్య చికిత్స వ్యయాలు* : ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు చేయించే వైద్య చికిత్సలకు అయ్యే వ్యయంపై ఏడాదికి రూ.50 వేల గరిష్ఠ పరిమితికి లోబడి 80డీ సెక్షన్ కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 🔴🔴🔴🔴🔴