Search This Blog

Wednesday, October 10, 2018

💥సస్పెన్షన్లు - జీవనాధార భత్యము*💥 *(Subsistance Allowance)*

.
   *💥సస్పెన్షన్లు - జీవనాధార భత్యము*💥
      *(Subsistance Allowance)*
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
*☀జీవనాధార భత్యము అంటే జీత భత్యములు పొందకుండా సస్పెన్షనులో ఉన్న ఉద్యోగి నెలవారి చెల్లించే భత్యము.*

*☀సస్పెన్షను అనునది ఉద్యోగికి విధించిన శిక్ష కాదు. సస్పెన్షను కాలములో ఉద్యోగి జీవనాధారంగా ఉన్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం ఫండమెంటల్ రూల్ 53 లోని నియమ నిబంధనలకు లోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.*

*☀జీవనాధార భత్యం ఎలా లెక్కించాలి:*

*⚡మొదటి మూడు నెలలకు,ఉద్యోగి అర్ధజీతపు సెలవులో వెళ్ళియుంటే పొందునటువంటి సెలవు జీతమునకు సమానంగా వచ్చు మొత్తాన్ని చెల్లిస్తారు-ఎఫ్.ఆర్.53(1)(ii)(a)*

*⚡మూడు నెలల తర్వాత కూడా సస్పెన్షన్ కొనసాగిన,అట్టి కొనసాగింపునకు ఉద్యోగి ఏ విధంగాను బాధ్యుడు కానప్పుడు మొదటి మూడు నెలలకు చెల్లించిన దానిపై 50 శాతం అధికం చేయవచ్చు.ఒకవేళ సస్పెన్షన్ కొనసాగింపునకు ఉద్యోగి బాధ్యుడైన పక్షంలో మొదటి మూడు నెలలకు చెల్లించిన దానిపై 50 శాతం తగ్గించవచ్చు.*

*⚡ఏ అధికారి అయితే ఉద్యోగిని సస్పెండు చేసాడో అట్టి అధికారి రివ్యూ చేసి నిర్ణయం తీసుకోవచ్చు.*

*⚡సస్పెండు ఆయిన ఉద్యోగి తాను సస్పెండు అయిన తరువాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/ఇతరత్రా వ్యాపకం గాని చేయటం లేదని దృవీకరణ పత్రం అధికారికి అందజేయాలి. అట్టి దృవీకరణ పత్రము ఇవ్వని పక్షంలో జీవనాధార భత్యములు నిలుపుదల చేయవచ్చు-ఎఫ్.ఆర్.53(2)*

*జీవనాధారభత్యము సస్పెండు ఆయిన ఉద్యోగి తిరస్కరించారాదు. జీవనాధారభత్యము చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరము.*
*Govt. Memo.No.29730/A/458/SE/FR-II/96-F తేది:14.10.1996*

*⚡సస్పెండు కాకముందు తేది నాటికి ఉద్యోగి పొందుచున్న మూలవేతనంలో సగం మొత్తం.*

*⚡అట్టి సగం మూలవేతనం పై వచ్చు దామాషా కరువు భత్యం.*

*⚡సస్పెండు కాకముందు తేది నాటికి  పొందుచున్న మూలవేతనంపై పూర్తి ఇంటి అద్దె మరియు సిటీ కాంపెంసెటరీ అలవెన్సులు పరిమిత కాలానికి అనుగుణంగా పూర్తిగా చెల్లిస్తారు.*

*⚡జీవనాధార భృతి పెంచిన సందర్భాలలో వెనుకటి తేది నుండి పెంచుటకు ఉత్తర్వులు ఇవ్వకూడదు.*

*⚡ఉద్యోగి సస్పెన్షనులో ఉన్న కాలానికంతటికి రివ్యూలతో సంబంధం లేకుండా జీవన భృతి చెల్లించాలి*
          
.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top