Search This Blog

Wednesday, September 5, 2018

సావిత్రీబాయి ఫూలే... ఉపాధ్యాయుల దినోత్సవం- @@@ సావిత్రీబాయి ఫూలే... ఉపాధ్యాయుల దినోత్సవం @@@

Voice Of Bahujana

సావిత్రీబాయి ఫూలే... ఉపాధ్యాయుల దినోత్సవం-

@@@ సావిత్రీబాయి ఫూలే... ఉపాధ్యాయుల దినోత్సవం @@@

___________________________________________

ఉపాధ్యాయుని గొప్పతనానికి కొలమానం ఏమిటి?? 
అవార్డులు, పదవులు, పొగడ్తలూ, పారితోషికాలా... ఇవేవీకావు..

**ఒక ఉపాధ్యాయుడు 
# తన జీవితంలో ఎంతమంది విధ్యార్థులను చైతన్యవంతులను చేయగలిగాడు., 
# ఎంతమంది ఆలోచనా విధానాలను ప్రభావితం చేయగలిగాడు.,
# అవి ఏ విధమైన సామాజిక విప్లవానికి నాంది పలికాయి.,

అన్నవే ఉపాధ్యాయ వృత్తికి నిజమైన గొప్ప కొలమానాలు...

మరి నిండా ఒక సంవత్సరం బోధనానుభవం కూడా లేని, కనీసం తన భార్యకు కూడా చదువు నేర్పకుండా, తన స్వంత కూతురికి బాల్య వివాహం చేసిన.., డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఉపాధ్యాయుల దినోత్సవాలు చేసుకోవడం ఎందుకు జరుగుతోంది...

హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రాధాకృష్ణన్ తన తత్వశాస్త్ర పరిజ్ఞానాన్ని భారత దేశ నిర్మాణానికి ఉపయోగించేలా చేసిన బోధనలు గానీ, అలా ఉపయోగించేలా మిగతా ఉపాధ్యాయులకు దిశానిర్ధేశం చేసిన దాఖలాలు గానీ లేవు...

1962 సం॥ సెప్టెంబరు 5న తన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన నాయకులు మరియు కొంతమంది విధ్యార్థులతో "నా పుట్టినరోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే నేను సంతోషిస్తాను" అని కోరడంతో ఆరోజునుండి ఈ ఆనవాయితీ మొదలైనది... అంతేగానీ ఈ దినాన్ని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు...

@@@ నిజమైన ఆదర్శ ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి ఫూలే @@@

సమాజంలో కొనసాగుతున్న అసమానతలకు బానిసత్వానికి కారణం విధ్యలేకపోవడమేనని.. విధ్య లేకపోవడంతో బానిసత్వానికి గురి అవుతున్నవారికి తిరుగుబాటు చేయాలనే ఆలోచన కూడా రాదని గుర్తించిన
"మహాత్మా" ఫూలే .., కుల మరియు లింగ వివక్షకు గురి అవుతున్నవారికోసం పాఠశాలలు ఏర్పాటు చేసారు..

ఆ క్రమంలో జనవరి 1, 1848 న బిదెవాడ (పూణె)లో
"""భారత దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల""" ను స్థాపించారు  సావిత్రిబాయి.. అప్పటికి సావిత్రీబాయి వయసు కేవలం 17 సం॥ మాత్రమే.,

బాలికలకు చదువును అగ్రకులాలు బలంగా వ్యతిరేకించడంతో వారికి పాఠాలు చెప్పే, ఉపాధ్యాయులెవరూ సిద్ధం కాని కారణంగా జ్యోతి బా ముందుగా సావిత్రీబాయికి చదువు నేర్పించారు.
         

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top