Search This Blog

Monday, March 5, 2018

*గురువు స్థానం..గ్రేట్*

🤠 *గురువు స్థానం..గ్రేట్*👸
💺💺💺💺💺💺💺💺💺
🔷ఒకప్పుడు టీచర్ లకు రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది...🤗
ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధాని కి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల *టీచర్ పేరు బస్బీ.*
ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.
తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం.... టీచర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు*
.🔷 సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) *రావద్దనేంత దమ్ముందా టీచర్ కి?!*
ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు.
కారణం కూడా చెప్పాడు. ...
✍ *మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం -వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది... క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది*

ఉపాధ్యాయుల ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, అయన తన సమక్షంలో *రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి టీచర్ ని గౌరవిస్తానని* జవాబిచ్చాడు రాజు.
అలాగే చేసాడు కూడా...గ్రేట్..కింగ్💆‍♂

(శ్రీ తెన్నేటి కోదండరామయ్య గారి *'మా బడి' పుస్తకంలో  శ్రీ రవికృష్ణ గారు రాసిన మనవి మాటలు' నుండి.* )

*ఇలాంటి ఉదాహరణల నుంచి నేటి పాలకులు ఎంతో కొంత  నేర్చుకోవాల్సి ఉంది.టీచర్ లని ఏకవచన సంబోధనతో పిలిచే అధికార/అనధికారులకు ఇలాంటి విషయాలు కనీసం కొద్దిగా అన్నా~ అర్ధం అవుతాయా?* 🙃😌
👉 *ఎక్కడేతే ~ స్త్రీలు గౌరవింపబడతారో💆... అక్కడ సిరిసంపదలు ఉంటాయి..*

👉 *ఎక్కడైతే~ గురువులు👨🏻‍💼👩‍⚕ పూజింపబడతారో🙇...అక్కడ   ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి -దేశం శుభిక్షంగా ఉంటుంది.*....
ఇది 100% ✅👌😄...🌷

(మనపై పెత్తనం చేలాయించే వారందరికి ఈ మెసేజ్ చేరితే బాగుండేది...🤗)

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top