Search This Blog

Monday, March 5, 2018

ఉపాధ్యాయులకు జీతాలెక్కువ,పని తక్కువ"అనే వాదం బయలుదేరి,వాస్తవాలు మరుగున పడుతున్న సందర్భం లో...ఈ రోజు ఒక పత్రిక లో...వచ్చిన కథనం,నా వాదన లోని సంక్షిప్త కథనం.....చదివి,పరిశీలించి,అవగతం చేసుకొని... ఒక నిర్ణయానికి రా గలరని....ఆశిస్తూ......👇

🙋‍♂ప్రియమైన మిత్రులందరికీ  నమస్కారములు🙏
ఈ మధ్య....".ఉపాధ్యాయులకు జీతాలెక్కువ,పని తక్కువ"అనే వాదం బయలుదేరి,వాస్తవాలు మరుగున పడుతున్న సందర్భం లో...ఈ రోజు ఒక పత్రిక లో...వచ్చిన కథనం,నా వాదన లోని సంక్షిప్త కథనం.....చదివి,పరిశీలించి,అవగతం చేసుకొని... ఒక నిర్ణయానికి రా గలరని....ఆశిస్తూ......👇
      మిత్రులారా....నవసమాజ నిర్మాణానికి,బంగారు భవిత కు పునాదులు వేసే,అత్యంత పవిత్రమైన,బాధ్యతాయుతమైన వృత్తి....బోధనా వృత్తి.ఈ వృత్తి వ్యవస్థీకృతమైన జ్ఞానాన్ని బోధించే ఒక మహత్తరమైన కళ.
👉దేశ భవిష్యత్తు తరగతి గదులలో తీర్చిదిద్దబడుతుంది.ఆ తరగతి గదులు ఔన్నత్యాన్ని కాపాడే ఉపాధ్యాయులకు మాత్రం...ఒకప్పటి సామాజిక గుర్తింపు,గౌరవం,ఆదరణ...ఇప్పుడు లభించడం లేదు.

👉ఒక మంచి టీచర్ ఎలా ఉంటారు👇
👉విధినిర్వహణలో అంకిత భావం
👉సమయపాలన,మంచి అకాడమిక్ రికార్డ్ ను కలిగి ఉండాలి.
👉ఆదర్శవంతమైన వ్యవహార సరళి,జీవన విధానం
👉తన సబ్జెక్ట్ లో నిత్యం వస్తున్న కొత్త విషయా లను నేర్చుకుంటూ,నిరంతర జ్ఞానాన్వేషి గా ఉండాలి.
👉పిల్లల్ని సృజనాత్మక కార్యక్రమాల వైపు మళ్లించ గలగాలి.
👉సామాజిక,కుటుంబ, ఆర్ధిక,సాంస్కృతిక,నైతిక విషయాలను గురించి అవగాహన కల్పించాలి.
🌹ఈ వృత్తి యెడల యువతను ఎలా ఆకర్షించాలి?
👉మంచి సమాజం రూపొందలంటే...అత్యంత ప్రతిభావంతులైన వారు ఈ రంగం లోకి రావాలి.కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాలకు ఈ విషయంలో ముందు చూపు లేదు.ప్రతిభావంతులైన వారిని బోధనా రంగం వైపు మారే విధంగా ఆకర్షణీయమైన,జీతభత్యాలు,సౌకర్యాలు,హోదా ఉండాలి.కానీ...ఇక్కడ ఆ పరిస్థితి లేదు.ఉదా;-👇
👉ప్రపంచ సగటు ఉపాధ్యాయుని ఆదాయం సంవత్సరానికి 50 వేల డాలర్లు, కాగా,మన దేశంలో 10నుండి 20వేల డాలర్లు గా ఉంది.
👉ప్రపంచంలో నే అత్యధికంగా లక్సెంబర్గ్ లో ఒక టీచర్ కు సం;-కి 1లక్ష 38 వేల డాలర్ల గరిష్ఠ వేతనం అందుతుంది.
👉స్విట్జర్లాండ్ లో...68 వేల డాలర్ల వేతనం వస్తుంది.

👉నేటి తరానికి ఈ వృత్తి యెడల అనాసక్తి ఎందుకు?
👉ఈ రంగం లో తగిన భద్రత ఉన్నా,సివిల్ సర్వీసులు,మెడిసిన్,ఇంజనీరింగ్,సాఫ్ట్వేర్,బ్యాంకింగ్,రైల్వే,రెవిన్యూ, మొ; రంగాలలో లభిస్తున్న హోదా,ఇతర సౌకర్యాలు,జీత భత్యాలు, టీచర్ జాబ్ లో లభించని కారణంగా....చాలామంది ఈ వృత్తి యెడల అనాసక్తి చూపుతున్నారు.

🤦‍♂పని ఒత్తిడి🙆‍♂
👉బోధనా రంగం లో ఉండేవారికి పనికాలం ఒత్తిడి E. U. దేశాలలో సం:-కి 800 గంటలు,కొలంబియాలో..1200 గంటలు,ఉండగా,మనదేశంలో 1600 గంటలుగా ఉంది.
😇సమస్యలు😇
👉ప్రపంచంలో...ఏ దేశంలో లేని విధమైన కొన్ని విద్యేతర కార్యక్రమాలలో భాగస్వాములవ్వడం.
👉15 లక్షలమంది ఉపాధ్యాయుల కొరత దేశవ్యాప్తంగా ఉంది.
👉కె.జీ. నుండి p. g. దాకా అన్ని స్థాయిలలో...తాత్కాలిక, కాంట్రాక్ట్,పార్ట్ టైం,గెస్ట్ టీచర్లు, విద్యా వాలంటీర్లు మొ;-విధానాలతో...తక్కువ జీతభత్యాలు ఇవ్వడం తో...ఈ రంగం లోకి వచ్చే వారు అభద్రత కు లోనౌతున్నారు.
👉ఆనేక ఉన్నత పదవులు అనగా NCERT చైర్మన్,వైస్ చైర్మన్,directors,RJD, DEO,Dy Eo,MEO....ఇలా...సర్వం ఇంఛార్జి ల పాలనే.
🙋‍♂ఈ విధంగా అనేక సమస్యలతో..సతమతమౌతూ.🤝..నవభారత నిర్మాణానికి సాయిసక్తులా కృషి చేస్తున్న...మా ఉపాధ్యాయుల పరిస్థితులను అర్ధం చేసుకో గలరని ఆశిస్తూ......
😌అన్ని విభాగాలలో ఉన్నట్టే మా విభాగం లో కూడా ఉన్న అతి కొద్దిమంది అంకితభావం లేనివారిని దృష్టిలో పెట్టుకుని అందరినీ ఒకే గాటన కట్టవద్దని కోరుకుంటూ.....🙋‍♂
మీ......👇

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top