🔲సూక్తులు
🔻ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి.
🔻ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క (వ్యవహారపు) పని ఒత్తిడిలో ఉంటాడు.
🔻ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు.
🔻ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం.ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం.
🔻ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం.ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు.
🔻ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.
🔻ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది.
ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు.
🔻ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు.ఒకటిగా చేరడం ప్రారంభం,
🔻ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం.
🔻ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం.
🔻ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
🔻ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
🔻ఒక్క సంతోషం వంద విచారాలను తరిమికొడుతుంది.