తెలంగాణలో 18 రోజుల పాటు నిషేధం సడలింపు
రెండేళ్లు పూర్తైన వారికి అర్హత
ప్రతి విభాగంలో గరిష్ఠంగా 20 శాతం మందికే అవకాశం
దస్త్రంపై ఆర్థిక మంత్రి సంతకం పూర్తి
సీఎం ఆమోద ముద్ర పడగానే ఉత్తర్వులు
ఆర్థిక మంత్రి సంతకం పూర్తి: ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై తాజాగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సంతకం పూర్తయి అక్కడి నుంచి సీఎస్‌కు చేరింది. ఆ దస్త్రం సీఎస్ నుంచి సీఎంకు వెళ్తుంది. సీఎం సంతకం తర్వాత మార్గదర్శకాలు జారీ అవుతాయి. ఉద్యోగుల బదిలీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని మే 25వ తేదీన సడలించి 18 రోజుల తర్వాత మళ్లీ విధిస్తారు.
ప్రతిపాదిత మార్గదర్శకాలు..
* పరిపాలన అవసరాల దృష్ట్యా ప్రభుత్వమే బదిలీ చేసే వారు మినహా మిగతా వారిలో బదిలీ కోరుకొనే ఒక్కో ఉద్యోగి నుంచి 3 ఐచ్ఛికాలను స్వీకరిస్తారు.
* ఒకే ప్రాంతాన్ని ఒకరికంటే ఎక్కువమంది కోరుకొంటే వారిలో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
* బదిలీకి రెండేళ్ల కనీస సర్వీసు అవసరం. ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా ఉంటున్నవారికి బదిలీ తప్పకుండా ఉంటుంది.
* ఆయా శాఖల్లో పనులకు అంతరాయం లేకుండా చూడటంలో భాగంగా ఒక్కో క్యాడర్‌లో బదిలీలను గరిష్ఠంగా 20 శాతానికే పరిమితం చేస్తారు. 20 శాతానికి మించి అభ్యర్థనలు ఉంటే వారిలో ఎక్కువ సర్వీసు గల వారిని పరిగణనలోకి తీసుకొంటారు.