Search This Blog

Wednesday, May 18, 2016

గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీ -టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి త్వరలో నోటిఫికేషన్ -సర్వీస్ నిబంధనలు సిద్ధంచేస్తున్న అధికారులు

గురుకులాల్లో 2,444 పోస్టుల భర్తీ
-టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి త్వరలో నోటిఫికేషన్ 
-సర్వీస్ నిబంధనలు సిద్ధంచేస్తున్న అధికారులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని వివిధ శాఖల పరిధిలో ఖాళీల భర్తీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గురుకుల విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నది. వివిధ సంక్షేమశాఖల పరిధిలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీచేయాలని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనుక గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు త్వరలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నది. గురుకులాల్లో ప్రభుత్వ పరంగా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నందున.. ఆయా శాఖల అధికారులు.. ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. దీనిపై కసరత్తు పూర్తి కాగానే నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 758 పోస్టులు, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో 313, బీసీ సంక్షేమ శాఖ విద్యాలయాల్లో 307, ఎస్టీ సంక్షేమ గురుకులాల్లో 436, మైనారిటీ సంక్షేమ గురుకులాల్లో 630 పోస్టులను భర్తీ చేయనున్నారు. శాఖలు, క్యాటగిరీల వారీగా గురుకుల విద్యాలయాల్లో భర్తీచేయనున్న పోస్టుల వివరాలివి: 

సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం: గురుకుల ఉపాధ్యాయ సంఘం
ఖాళీ పోస్టుల భర్తీతోపాటు సీఎం కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో గురుకుల వ్యవస్థ బలోపేతానికి ప్రోత్సహించడం హర్షణీయమని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి జే రామలక్ష్మయ్య, ప్రతినిధులు అర్జున్, లచ్చయ్య పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒకే ఏడాదిలో 220 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. గురకులాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్.. వాటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతన వ్యత్యాసాలను సవరించాలని కోరా




CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top