Search This Blog

Tuesday, February 2, 2016

'కొలెస్ట్రాల్‌'ను త‌గ్గించే మెంతి ఆకు...|Fenugreek leaves may reduce bad cholesterol -Health News

మెంతికూర మనకు ఆహారంగానే కాక అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసే ఔషధంగా ఉపయోగపడుతుంది. దీన్ని మనం తరచూ కూరగా తీసుకుంటూనే ఉంటాం. అయితే ఇలా తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. లివర్ సమస్యలను తొలగించడంలో మెంతికూర బాగా పనిచేస్తుంది. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి. డయేరియాకు చక్కని మందుగా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలు మాయమవుతాయి. 

2. మెంతికూర ఆకులు రక్తంలోని లిపిడ్ లెవల్స్‌పై మెరుగైన ప్రభావం చూపుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మెంతి ఆకులను కొంత నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగితే చక్కని ఫలితం ఉంటుంది. 

3. యాంటీ డయాబెటిక్ ధర్మాలను మెంతి కూర కలిగి ఉంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌ను నయం చేయడంలో బాగా పనిచేస్తుంది. 

4. మెంతికూరలోని ఔషధ కారకాలు రక్తం గడ్డకట్టకుండా చూస్తాయి. హార్ట్ అటాక్, ఇతర గుండె సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెంతి కూరలో ఉన్నాయి. ఇవి శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. 

5. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో మెంతి కూర బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా ముఖంపై ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి. మెంతి ఆకులను పేస్ట్‌గా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా మారుతుంది. తరచూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు గట్టిపడి ప్రకాశవంతంగా తయారవుతాయి.











'కొలెస్ట్రాల్‌'ను త‌గ్గించే మెంతి ఆకు...|Fenugreek leaves may reduce bad cholesterol -Health News

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top