Search This Blog

Tuesday, February 16, 2016

పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ దృష్టి

ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : పదోతరగతి పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అందుకు తగిన ఏర్పాట్లను మొదలుపెట్టింది. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షా సెంటర్‌లో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని 35 పరీక్షా కేంద్రాల్లో ఒక్క నెలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కొంత కష్టంగా మారడంతో.. ప్రస్తుతం కెమెరాలు ఉన్న పాఠశాలల్లో మాత్రమే పరీక్షలు పూర్తిచేసి, వచ్చే సంవత్సరం అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలుచేసే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. లేదా వద్దని మాత్రం ఇప్పటి వరకు విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవని పలువురు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా మాస్‌కాపీ యింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ విద్యా సంవ త్సరం నుంచే పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 10 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ప్రతి విద్యాసంవత్సరం ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు పరీక్షా కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని యథేచ్ఛగా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపఽథ్యంలో.. ఈ సారి అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల పరీక్షల అవకతవకలే కాకుండా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు కూడా తెలుసుకునే అవకాశం ఉందని పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
నగరంలో 351 పరీక్షా కేంద్రాలు... 
హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 351 పరీక్షా కేంద్రా ల్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా మెత్తంగా 80,621 మంది పదో తరగతి విద్యారు ్థలు పరీక్షలు రాస్తుండగా... అందులో రెగ్యులర్‌ విద్యా ర్థులు 66,641 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 11,977 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు 351 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో రెగ్యులర్‌ విద్యార్థుల కోసం 301 పరీక్షా కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించారు. 
351 పరీక్షా కేంద్రాలకు గానూ 184 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలోని 35 ప్రభుత్వ పాఠశాలలు పదోతరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. వీటిలో సీసీ కెమెరాలు అందుబాటులో లేవని, ప్రభుత్వం సహకారంతో ఆ స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 
ప్రైవేటు పాఠశాలలుగా ఉన్న పరీక్షా కేంద్రాలన్నిం టిలో దాదాపు సీసీ కెమెరాలున్నాయి. ప్రతి పరీక్షా కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య, వారికి కేటాయించిన హాళ్లను బట్టి వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top