ఈనాడు, హైదరాబాద్: విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి అదనంగా దళితుల అభివృద్ధి, సహకార శాఖలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారమిక్కడ ఈ మేరకు జీవో.44ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ శాఖలను ముఖ్యమంత్రే చూస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వంలో గతంలో విద్యామంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డిని ఏడాది క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణ సందర్భంగా విద్యాశాఖ నుంచి విద్యుత్ శాఖకు మార్చారు. తాజాగా ఆయనకు అదనంగా మరో రెండు శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది