TGARIEA
తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్
హైదరాబాద్
తేదీ: 13-01-2026
తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల/రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నుండి రెగ్యులరైజ్ అయిన ఉపాధ్యాయులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఆల్ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (TGARIEA) డిమాండ్ చేసింది.
2007, 2009 మరియు 2010 సంవత్సరాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ రెగ్యులరైజ్ అయిన ఉపాధ్యాయులకు సంబంధించి G.O.Ms.No.59, తేదీ: 10-08-2007 లోని పేరా–8 ప్రకారం అర్హత ఉత్తర్వులు (Qualified Orders) ఇప్పటికీ జారీ చేయలేదని TGARIEA ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ మేరకు TGARIEA రాష్ట్ర అధ్యక్షులు ఏ. నర్సింహులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎస్. గణేష్లు గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మరియు TGSWREI సొసైటీ చైర్మన్, ప్రధాన కార్యదర్శి (SCDD), అలాగే TGSWREI సొసైటీ కార్యదర్శికి వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.
G.O.Ms.No.59 లోని పేరా–8 ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత లేని 372 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను TGT కేడర్‌లో రెగ్యులర్‌గా నియమించాలి, అయితే PG అర్హత సాధించేవరకు వారికి PGT పదోన్నతి వర్తించదని స్పష్టంగా పేర్కొనబడిందని సంఘం గుర్తు చేసింది.
అయితే ఈ నిబంధనను పూర్తిగా అమలు చేయకుండా అప్పట్లో అర్హతలేమి పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడికి గురయ్యారని, కొందరు ఉద్యోగాలు కోల్పోయారని, మరికొందరికి సీనియారిటీ మరియు ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయని TGARIEA పేర్కొంది.
ఇదే సమయంలో TSPSC నోటిఫికేషన్–2017 ప్రకారం TGT పోస్టుకు డిగ్రీ + బి.ఎడ్, PGT పోస్టుకు PG + బి.ఎడ్ అర్హతలు మాత్రమే నిర్దేశించబడిన నేపథ్యంలో, గతంలో రెగ్యులరైజ్ అయిన ఉపాధ్యాయుల విషయంలో పేరా–8 అమలు చేయడం న్యాయసమ్మతమని సంఘం స్పష్టం చేసింది.
గత 16 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, కనీసం 50 మందికి పైగా అర్హత కలిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని TGARIEA ప్రభుత్వాన్ని కోరింది. పారా–8ను సంపూర్ణంగా అమలు చేసి అర్హత ఉత్తర్వులు 1-10-2007 నుండి జారీ చేస్తూనే ఉపాధ్యాయుల సేవా హక్కులు, సీనియారిటీ మరియు ఆర్థిక ప్రయోజనాలు పునరుద్ధరించబడతాయని సంఘం పేర్కొంది.
ఇట్లు
ఎస్. గణేష్
ప్రధాన కార్యదర్శి, TGARIEA
ఏ. నర్సింహులు గౌడ్
రాష్ట్ర అధ్యక్షులు, TGARIEA
📞 సంప్రదింపు:
9441931242 | 9989632443






