🔊 *ఇది ఒక్క ఉపాధ్యాయుని వేదన కాదు... ఇది లక్షల మంది టీచర్ల గళం* !
🔴 *ఇదంతా పేద విద్యార్థులకు విద్య రాకుండా చేయడానికే అనిపిస్తోంది* !
🔹 *ఒకప్పుడు టెక్నాలజీ లేని రోజుల్లో టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పారు* ... *పిల్లలు గొప్పవాళ్లు అయ్యారు* !
🔹 బిల్డింగ్స్ లేని కాలం... బోర్డు లేని రోజులు... టాయిలెట్స్ లేని తరగతులు...
🔹 మధ్యాహ్న భోజనం లేని రోజుల్లోనూ, బ్యాగ్, బాక్స్, డ్రెస్, షూస్ లేకుండా ఉన్నప్పుడు కూడా టీచర్లు ఒక్కటే చేశారు – పాఠాలు చెప్పారు!
🔹 ఒక టీచర్ అయిదు తరగతులకు పాఠాలు చెప్పిన రోజుల్లో పిల్లలు IAS అయ్యారు, డాక్టర్లు అయ్యారు!
📌 ఇన్ని లేనప్పుడు చదువు వచ్చింది... ఇప్పుడు అన్నీ ఉన్నా చదువు కనబడటం లేదు!
🔴 ఇప్పటి దుస్థితి చూస్తే గుండె చీలిపోతుంది!
🔸 పాఠశాల లోపల 📚 పాఠం కన్నా 📸 ఫొటో ముఖ్యం!
🔸 టీచర్ Chalk & Talk వదిలేసి… Track & Upload లో మునిగిపోయాడు.
🔸 Online Attendance,FRS, అస్సేస్మెంట్, Reports, PMR,WhatsApp Updates...
🔸 కాని పిల్లవాడి కళ్లలోకి చూసే శక్తికి చోటే లేదు!
⚠️ విద్యార్థి హస్తగతం కాకుండా, పాఠశాల ఏకంగా డాక్యుమెంటేషన్ కేంద్రంగా మారిపోయింది!
📉 పాఠం కన్నా ఫారాలు...
📉 పుస్తకం కన్నా యాప్ స్క్రీన్షాట్...
📉 విద్యార్థి అభివృద్ధి కన్నా సెల్ఫీ అప్‌లోడ్‌కు ప్రాధాన్యం!
🌐 ఇలాంటి పరిస్థితేనంటూ… ఎవరూ మాట్లాడటం లేదు… కానీ వేలాది ఉపాధ్యాయులు ఊపిరాడక అల్లాడిపోతున్నారు!
🔹 పాఠం చెప్పే అవకాశం లేకపోవడం…
🔹 విద్యార్థి స్థాయిని బట్టి బోధించే స్వేచ్ఛ లేకపోవడం…
🔹 చదువు బాగా రావాలన్న టీచర్ ఆశయాన్ని – పాలసీలు పట్టించుకోవడం లేదు!
🌟 తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆంగ్ల మాధ్యమం లేని రోజుల్లో కూడా...
✅ టీచర్లు విద్యార్థికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పారు!
✅ వారే కలెక్టర్లు అయ్యారు, దేశ విదేశాల్లో CEOలు అయ్యారు, పైలెట్లు అయ్యారు!
📌 అక్కడే మెరుపు ఉంది… అక్కడే నేటి పాలనకి దారి ఉంది!
💥 ఈరోజు టీచర్ పరిస్థితి ఏమిటంటే…
🟥 విద్యార్థి ముఖం కన్నా... సెల్‌ఫోన్ స్క్రీన్ ముఖ్యమైపోయింది!
🟥 పాఠం చెప్పే కంటే... రిపోర్టు అప్‌లోడ్ ముఖ్యం!
🟥 విద్యార్థి నలుగురిలో మేధావిగా తయారవ్వాలన్న ఆశయాన్ని... మార్గదర్శకాలు మింగేస్తున్నాయి!
💔 బోధన విషయంలో ఓనమాలు రాని వారు… ఇప్పుడు "ఇలా చెప్పాలి, అలా చదివించాలి" అని ఆదేశిస్తున్నారు!
💔 పాఠశాలలో పాఠాలు కూడా చెప్పని వారు... టీచర్లకు బోధన విధానం చెబుతున్నారు!
🎯 సాంకేతికత అనేది ఉపకరణం కావాలి… విద్యపై భారం కాకూడదు!
🎯 టీచర్‌కు తన పాఠాన్ని నేర్పే స్వేచ్ఛ, సమయం, గౌరవం ఇవ్వాలి… అదే అసలైన విద్యా సంస్కరణ!
✅ 1 నుండి 10వ తరగతి విద్యార్థికి అవసరమైన నైపుణ్యాలను బోధించే అవకాశం ఇవ్వండి!
✅ చదవడం – రాయడం – ఆలోచించడం – గణిత అవగాహన బలపరిచే స్వేచ్ఛ ఇవ్వండి!
✅ పిల్లల స్థాయి, గ్రామీణ నేపథ్యం, బోధన భాష... అన్నీ పరిగణనలోకి తీసుకుని విధానం రూపొందించండి!
📢 ఈ దేశంలో నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, విదేశీ CEOలు, వైమానిక వీరులు... అందరూ పాఠశాలలో టీచర్ చెప్పిన పాఠం వల్లే ఎదిగారు – ఇది ఓ నగ్నసత్యం!
📢 ఈరోజు టీచర్‌కు పాఠం చెప్పే సమయం దొరకకపోతే... రేపటి పౌరుడి భవిష్యత్తు ఎక్కడుండబోతుంది?
📚 బోధనకు గౌరవం కల్పించండి… టీచర్ మాట్లాడే స్వరం దేశ భవిష్యత్తు మారుస్తుంది!
"విద్యార్థి జీవితాన్ని మార్చే ఓ గొప్ప వాక్యం... పుస్తకంలో కాదు... ఓ టీచర్ నోటి నుంచే వస్తుంది!"
