12th PRC - ఒక అరణ్య రోదన... ఆరని ఆవేదన
పంచభూతాలే సాక్ష్యం...
ఉపాధ్యాయ ఉద్యోగుల బతుకులు అగమ్యగోచరం!
యే మట్టిలో కలిసాయో 12th PRC పై ఆశలు...
యే గాలిలో కలిసిపోయాయో IR ఊసులు...
యే అగ్నిలో ఆహుతి అయ్యాయో 11th PRC బకాయిలు...
యే నింగిలో దాక్కున్నాయో అందనంత ఎత్తులో కొత్త DAలు...
యే నీటిలో మునిగిపోయాయో నేతల వాగ్దానాల మూటలు...
నిద్ర నటిస్తున్న సంఘాల నాయకులు MLC లారా..
ఇకనైనా కుంభకర్ణ నిద్ర లోనుంచి మేల్కొనండి!
మీ మౌనం మాకు శాపం... మీ జాప్యం మాకు మరణ శాసనం.
కాలం కరిగిపోతోంది...
2025 పాయింటే 2026 కూడా వచ్చే
12th PRC కాలగర్భంలో సగం కలిసిపోయింది.
01-07-2023...
అది కేవలం ఒక తేదీ కాదు.
అప్పటి నుండి
నేటి వరకు
అనంత లోకాలకు వెళ్ళిన అమరులైన
ఉపాధ్యాయ ఉద్యోగులెందరో...
న్యాయం జరగకుండానే పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగులెందరో...
"
ఏది PRC?
ఏది సరెండర్ లీవ్,
ఏవి ఇంటి స్థలాలు?
ఏవి రిటైర్మెంట్ బకాయిలు?
అంతా ఎండమావులు... అంతులేని విషాదాలు.
ఏ PRC చూసినా ఏమున్నది గర్వకారణం?
ఉపాధ్యాయ ఉద్యోగుల కడుపు మంట.తప్ప..
సగం కాలహరణం!
పీఆర్సీ నివేదిక ఎప్పటినుంచో సిద్ధంగా ఉన్న తెప్పించుకోని పాలకులు
ఈ విషయం అడగని ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘాల నాయకులు, MLC లు
సంఘాల నాయకులారా!
కేవలం చందాలు వసూలు చేయడం, సొంత పనులు చూసుకోవడం, ఏసీబీ కేసులు పైరవీలు చేయడం, ఓడీ ఫెసిలిటీ పొందడమేనా మీ పని?
చచ్చిన వారికి న్యాయం చేయలేరా?
బతికున్న వారికి భరోసా ఇవ్వలేరా?
మా డిమాండ్ ఒక్కటే:
12th PRC ని 01-07-2023 నుండే అమలు చేయాలి!
మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలంటే...
రిటైర్ అయిన వారి బతుకులో కాంతి నిండాలంటే...
అడగండి...
గట్టిగా నిలదీయండి!
కొత్త ఏడాది 2026 కానుకగా...
కొత్త ప్రభుత్వంతో మా హక్కులను సాధించండి.
ఇట్లు
న్యాయం కోసం ఎదురుచూసి, చూసి కన్నుమూసిన ఉపాధ్యాయ ఉద్యోగులు,
గుండె నిండా ఆవేదనతో మార్చి 2024 తర్వాత పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ ఉద్యోగులు మరియు పెన్షనర్స్
