317 జీవో అమలులో జరిగిన లోపాలను సరిచేస్తామని గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మన్ గారు హామీ ఇచ్చారు. అన్ని సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ సెలవులు 21.09.25 నుండి ఇవ్వాలని ఇచ్చిన విజ్ఞప్తి మీద నిర్ణయం తీసుకొంటామని హామీ ఇచ్చారు.
317 జీవో అమలులో జరిగిన అవకతవకలు అన్నిటిని ఈ రోజు టీగారియ (TGARIEA) సెంట్రల్ యూనియన్ మరియు సోషల్ వెల్ఫేర్ యూనియన్ సభ్యులు గౌరవ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారిని కలిసి పాత జోన్ 6 వారిని ముఖ్యంగా కొత్తగా రెగ్యులరైస్ అయిన ఉపాధ్యానిలను సుమారు 150 వరకు జీవో నిబంధనలు పాటించకుండా దూర ప్రాంతాలకు వేయటం జరిగింది అని మహబూబ్నగర్ వారిని ఆదిలాబాద్ కు, ఖమ్మం వారిని వనపర్తి జిల్లా లకు బదిలీ చేయటం జీవో నిబంధనలకు, ప్రేసిడెన్షియల్ ఉత్తర్వులకు వ్యతిరేకం అని, ఈ చర్యలు తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసినట్టే అని గౌరవ మంత్రి గారికి బదిలీ అయిన వారి లిస్ట్ తో సహా సమర్పించగా వెంటనే స్పందించి 20 వ తేదీ తర్వాత డేట్ ఇస్తాను అందరిని కలుస్తాను అని ఈ అన్యాయం సరిచేస్తా అని హామీ ఇచ్చారు.
అదే విదంగా పెండింగ్ డి ఏ ఏరియార్స్ దసరా లోపల ఇప్పించాలని, సెకండ్ సాటర్డే సెలువు కూడా లేని విషయం పరిగణలోకి తీసుకొని సోషల్ వెల్ఫేర్ గురుకులాలకు అన్నిటికి 21.09.25 నుండి ఏకరూప సెలవులు ఉండాలని విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగింది.
గౌరవ మంత్రి గారు సానుకూలంగా స్పందించారు.
అందుకు వారికీ టీగారియ మరియు 317 బాధితుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాం.
డాక్టర్ మధు సూదన్ (జనరల్ సెక్రటరి )
జనార్దన్
ఆర్గనైజింగ్ సెక్రటరీ
ఎస్ గణేష్ (జనరల్ సెక్రటరి ),
రమేష్
సోషల్ వెల్ఫేర్ స్టేట్ యూనియన్.