💦 *సందేహాలు సమాధానాలు :*
✍️ *ప్రశ్న: సార్ ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్లో అయిన ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాతనే సెకండ్ ఇంక్రిమెంట్ చేస్తున్నారా. నాకు తెలిసిన సమాచారం మేరకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లోనే 10, 12 సంవత్సరాల సర్వీస్ చేసిన వాళ్లు కూడా ప్రొబేషన్ డిక్లేర్ చేసుకోకుండానే ఇంక్రిమెంట్లు అన్ని తీసుకొని తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ చేయించుకున్న వారు కూడా ఉన్నారు. ఓన్లీ మా జేపీఎస్ నుండి వచ్చిన గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులకు మాత్రమే ఈ విధంగా సెకండ్ ఇంక్రిమెంట్ చేయమని ఎస్టీఓ నుంచి బిల్ రిటర్న్ పంపుతున్నారు. ఇది కరెక్టేనా దీనికి మేము ఎవరిని అప్రోచ్ కావాలి మా సమస్య పరిష్కారం చేసుకోవడానికి దయచేసి చెప్పగలరు?*
✒️ *సమాధానం:*
* *చేస్తున్నారా? లేదా అంటే నేనెలా చెబుతాము. Probation declare అయితే మాత్రమే రెండవ ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.*
*🔖 ప్రొబేషన్ డిక్లేర్ కాకపోవడానికి రెండు కారణాలు.*
* *1. అడ్మినిస్ట్రేటివ్ డిలే*
* *2. Probation సంత్రుప్తి కరంగా పూర్తి చేసుకోకపోవడం.*
*🍥 అడ్మినిస్ట్రేటివ్ డిలే:*
* *సహజంగా రెండేళ్లు పూర్తి కాగానే వెంటనే చేయడం సాధారణంగా జరగదు. అందరి సమాచారం తెప్పించుకుని చేయడానికి కొన్ని నెలల పట్టడం సహజమే. ఒకవేళ ఏడాది కంటే ఎక్కువ కాలం కనుక డిక్లేర్ చేయకుండా/extend చేయకుండా కనుక ఉంటే deemed to be declared గా భావించి ఇంక్రిమెంట్ లు మంజూరు చేయవచ్చు.*
*🌀 ప్రొబేషన్ పీరియడ్ సంతృప్తి కరంగా పూర్తి చేయలేకపోవడం*
* *ప్రొబేషన్ కాలంలో నిర్దేశించిన డిపార్టుమెంటు టెస్టులు పాస్ కాలేకపోవడం, నిర్దేశించిన ట్రైనింగ్స్ లు ఏమైనా ఉంటే పూర్తి చేయలేక పోవడం,CL మినహా ఇతరత్రా సెలవులు పెట్టడం వంటివి జరిగితే probation పొడిగింపు జరుగుతుంది. అలా గరిష్టంగా ఏడాది వరకు extend చేసే అధికారం నియామక అధికారికి ఉంటుంది. పొడిగించిన ఏడాదిలో కూడా పూర్తి చేసుకోలేక పోతే టెర్మినెట్ చేయాలి. లేదా ప్రభుత్వం నుండి probation extension కోసం, డిక్లరేషన్ కోసం ప్రత్యేక జీవో లు తెచ్చుకోవాలి. ఈ సందర్భంలో ఇంక్రిమెంట్ లు ఎప్పుడైతే probation declare చేస్తారో ఆ రోజు నుండే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఇచ్చేస్తే భవిష్యత్తులో ఎప్పుడూ ఒకప్పుడు రికవరీ చేయాల్సి వస్తుంది. చివరి వరకు దొరక్కుండా రిటైర్ అయిపోయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో (గ్రాట్యుటీ) రికవరీ పెడతారు.*
* *మూడేళ్ల కంటే ఎక్కువ కాలం పడితే ప్రభుత్వం నుండి కొనసాగింపు ఆదేశాలు పొందటం మాత్రమే కాదు, మెరిట్ ఆధారంగా వచ్చే సీనియారిటీ ను కూడా కోల్పోతారు.*
* 🐥