సాంఘిక సంక్షేమ గురుకులాలలోచదువు చెప్పడమే కాకుండా విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా నిలబడేలా తీర్చిదిద్దు తామని గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి అన్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ పై ఉన్నతి (లెర్న్, ఎర్న్, స్టాండ్ టాల్) ఫౌండేషన్ తో టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ఎంఓయూ చేసుకున్నదని తెలిపారు. మంగళవారం దామోదర సంజీవయ్య భవన్ లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ప్రధాన కార్యాయంలో అలగు వర్షిణి మీడియాతో మీడియాతో మాట్లాడారు. గురుకులాల నుంచి ఐఐటీకి వెళ్లారని, స్పోర్ట్స్ లో రాణించారని, సివిల్స్ సాధించిన వారు సైతం ఉన్నారు. మరోవైపు గురుకులాల నుంచి ప్రతియేటా సుమారు 20 వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా బయటకు వెళ్తున్నారని, అయితే వారిలో ఒక్క శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదని గుర్తించామన్నారు. అందుకే 'ఉన్నతి' ఫౌండేషన్ సహకా రంతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించేలా శిక్షణ ఇస్తున్నా మని చెప్పారు. ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరగ కుండా ముందస్తుగానే వంటలు వండే సమయంలో అన్ని జాగ్రతలు తీసుకుంటున్నామని చెప్పారు.
జూన్ మూడో వారం నుంచి..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 238 గురుకులాల్లో శిక్షణ ఇవ్వ నున్నట్లు అలగు వర్షిణి తెలిపారు. దీని కోసం ప్రతి రెసిడె న్షియల్ లో ఒక రూమ్ కేటాయించి, టీవీ, ప్రొజెక్టర్ కూడా
సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం జూన్ మూడో వారం నుంచి 40 మందితో కూడిన ఒక బ్యాచ్ కు 45 రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం గ్రామం, పట్టణాల్లోని స్టూడెంట్స్ ను ఎన్ రోల్ చేసుకోవా లని సూచించారు. ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల వరకు క్లాస్ ఉంటుందని తెలిపారు. వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ప్రతియేటా 36 వేల మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు..
15 కొత్త ఒకేషనల్ కోర్సులు
ఈ ఏడాది నుంచి 15 కొత్త ఒకేషనల్ కోర్సులు. మొదలు పెడుతున్నట్లు అలగు వర్షిణి తెలిపారు. కోడింగ్, కంప్యూటర్ లాంగ్వేజెస్ లో సైతం శిక్షణ ఇస్తామన్నారు. ఇందుకోసం రాస్ప్ బెర్రి పీఐ ఫౌండేషన్ తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నీట్, జేఈఈ, యూపీఎస్సీ, సీఏ వంటి పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ఇస్తామన్నారు..
ఈ విషయంలో కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 7, 8, 9 తరగతి విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తామని, దీని కోసం ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ అఫ్ ఇండియా సహకారంతో 70 మంది ఉపాధ్యాయులు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు.
కొత్తగా ఎమ్మెల్యేలకు లాగిన్
గురుకులాల్లోని అడ్మిషన్లు, సీట్లు, ఇతర అంశాల వివరాలు తెలిసే విధంగా కొత్తగా ఎమ్మెల్యేలకు లాగిన్ ఇస్తున్నట్లు డాక్టర్ అలగు వర్షిణి తెలిపారు. అలాగే, ప్రతి విద్యార్థికి సైతం ఈ లాగిన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ఇదివరకు తమతమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సీట్ల విషయంలో సిఫార్సు లెటర్లు ఇస్తున్న తరుణంలో ఆయా సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు తలెత్తున్న తరుణంలో ఎమ్మెల్యేలకు లాగిన్ ఇస్తున్నట్లు వివరించారు. తద్వారా పాఠ శాలల్లో అడ్మిషన్లు, సీట్ల ఖాళీల వివరాలు వారికి నేరుగా తెలిసే అవకాశం ఉంటుందన్నారు.
కో ఎడ్యుకేషన్ ఎత్తివేస్తాం
గురుకులాల్లోని ఉన్న కో ఎడ్యుకేషన్ ఎత్తివే స్తామని అలగు వర్షిణి తెలిపారు. విద్యార్థినుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. బాలికల హాస్టళ్లలో మెయిల్ ఎంప్లాయీస్ ఉండొద్దన్నారు. గతంలోని జీవోను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు