Search This Blog

Sunday, May 18, 2025

గురుకులాల్లో సరికొత్త రికార్డ్ ,తొలిసారిగా మే 17లో పే 5వ తరగతి సీట్ల భర్తీ గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడి



తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకు లాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఎన్న డూ లేనంతగా 5వ తరగతి సీట్లు భర్తీ అయ్యాయి. మే 17లోపే భర్తీ ప్రక్రియ పూర్తి కావడం గురుకుల చరిత్రలో ఇదే మొదటి సారి. గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్స రానికి గాను టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఆర్ ఈఐఎస్, ఎంజేపీటీడబ్ల్యూఆర్ు ఎస్ సొసైటీలో 5వ తరగతి సీట్ల భర్తీకి గాను ఈ ఏడాది ఫిబ్రవరి 23న టీజీసెట్ నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షలో నాలు గు సొసైటీల వారీగా సీట్లను.. 3 దఫాలుగా భర్తీ చేసి అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ జాబితాను ఇది వరకు రిలీజ్ చేశారు. తాజాగా శనివారం విడుదల చేసిన 1,822 సీట్లతో 5వ తరగతి సీట్లు పూర్తిగా నింపారు. మే 3వ వారంలోపు 5వ తరగతి సీట్లన్నీ భర్తీ కావడం రికార్డ్ అని టీజీ సెట్-2025 చీఫ్ కన్వీనర్ అలగు వర్షిణి వెల్లడించారు. గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కాలేజీ ల్లో అడ్మిషన్కు అర్హత పొందిన విద్యార్థుల జాబితాను ఈ నెల 23లోగా వెల్లడించను న్నారని గురుకుల కార్యదర్శి తెలిపారు.

రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఫలితాలు రిలీజ్ 

కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను 1:10 చొప్పున ఎంపిక చేసి, ఫిజికల్, మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో మొత్తం 80 సీట్లకుగాను 102 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన విద్యార్థుల జాబితాను శనివారం విడుదల చేశారు. 

మల్కాజిగిరి ఫైన్ ఆర్ట్స్ ఫలితాలు రిలీజ్ 

టీజీఎస్ఈబ్ల్యూఆర్ ఈఐఎస్ ఆధ్వ ర్యంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఏదు లాబాద్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో 6వ తరగ తిలో ప్రవేశానికి నిర్వహించిన స్కిల్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 210 మంది విద్యార్థులు స్కిల్ టెస్ట్కు హాజరు కాగా 85 మంది క్వాలిఫై అయ్యారు. వారి పేర్లను శనివారం వెల్ల డించారు. 


CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top