Search This Blog

Sunday, October 6, 2024

Credit card: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? మీకో గుడ్ న్యూస్.. మిస్ కాకండి..

 

Credit card: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? మీకో గుడ్ న్యూస్.. మిస్ కాకండి..

షాపింగ్ కోసం ఒకటి, ఫ్యూయల్ కోసం మరొకటి, లాంచ్ యాక్సెస్ కోసం ఇంకొకటి .. ఇలా కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతినెలా వీటి బిల్లులను సక్రమంగా చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే తమకు తెలియకుండానే అదనపు భారం పడుతుంది. ఇలాంటి సమయంలో ఒక్క కార్డునే ఉంచుకుని, మిగిలినవి రద్దు చేసుకోవాలని చాలా మంది సలహా ఇస్తారు. అయితే క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉండడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Credit card: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? మీకో గుడ్ న్యూస్.. మిస్ కాకండి..
Credit Card


క్రెడిట్ కార్డు అనేది నేడు ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. అన్ని ఆర్థిక లావాదేవీలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా షాపింగ్ చేయడానికి ఈ కార్డునే వినియోగస్తున్నారు. వివిధ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆన్ లైన్ లో షాపింగ్ చేసినప్పడు డిస్కౌంట్ తో పాటు అదనంగా క్యాష్ బ్యాక్ తదితర ఆఫర్లు వీటి ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. చాలామంది దగ్గర ఒకటికి మించి ఎక్కువ కార్డులు తీసకుంటున్నారు. షాపింగ్ కోసం ఒకటి, ఫ్యూయల్ కోసం మరొకటి, లాంచ్ యాక్సెస్ కోసం ఇంకొకటి .. ఇలా కార్డుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రతినెలా వీటి బిల్లులను సక్రమంగా చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే తమకు తెలియకుండానే అదనపు భారం పడుతుంది. ఇలాంటి సమయంలో ఒక్క కార్డునే ఉంచుకుని, మిగిలినవి రద్దు చేసుకోవాలని చాలా మంది సలహా ఇస్తారు. అయితే క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉండడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గమనించాల్సిన అంశం..

క్రెడిట్ కార్డు వినియోగించేటప్పుడు కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. దానిలో లిమిట్ ఉన్నంత వరకూ ఉపయోగించకూడదు. క్రెడిట్ కార్డు పరిమితిలో మీరు వినియోగించుకున్న శాతం 30కి మించకూడదు. దీన్నే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూాఆర్) అంటారు. ఈ రేటు అనేది క్రెడిట్ స్కోర్ కు చాాలా కీలకంగా ఉంటుంది.

సీయూఆర్..

మీరు రెండు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిని వివిధ అవసరాలకు వినియోగిస్తున్నారు. వాటిలో ఒక కార్డుపై ఒక లక్ష, రెండో కార్డుపై రెండు లక్షల పరిమితి ఉంది. కార్డుల్లో క్రెడిట్ లిమిట్ 30 శాతానికి మించకూడదు. కాబట్టి మొదటి కార్డులో రూ.30 వేలు, రెండో కార్డులో రూ.60 వేల వరకూ ఉపయోగించుకోవచ్చు. అంటే రెండో కార్డులపై రూ.90 వేలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది మీ అవసరాలకు సరిపోతుందనుకున్నాం. ఎక్కువ కార్డులున్నాయని మీ మొదటి కార్డును తీసివేశారనుకోండి. రెండో కార్డులో రూ.60 వేలు మాత్రమే వాడుకోగలరు. దానికి మంచి ఎక్కువ వాడితే సీయూాాాఆర్ పెరిగిపోయి, మీ క్రెడిట్ కార్డు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

రుణాల మంజూరులో కీలకం..

క్రెడిట్ స్కోర్ ను మెరుగ్గా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ చాలా కీలకం. బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి చాలా అవసరముంటుంది. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే మీరు ఆర్థిక లావాదేవీలు బాాగా నిర్వహిస్తారని, రుణం మంజూరు చేస్తే సక్రమంగా కడతారని గుర్తింపు ఉంటుంది. దీనివల్ల మీకు తక్కువ వడ్డీకి, చాలా సులభంగా రుణాలు లభిస్తాయి. క్రెడిట్ కార్డులో పరిమితిని ఎక్కువగా వాడుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి.

ఆఫర్లనూ పరిశీలించండి..

క్రెడిట్ కార్డులపై వివిధ రకాల ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. లావాదేవీల సమయంలో వాటిని ఉపయోగించుకోవచ్చు. ఒకటి కన్నా కార్డులు ఉండడం వల్ల ఎక్కువ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్డులను తరచూ ఉపయోగించుకోకపోయినా ఆఫర్లు వాడుకోవచ్చు. కాబట్టి కార్డు రద్దు చేసుకుందామనుకుంటే ఈ విషయాన్ని ఆలోచించాలి.

రద్దు చేసుకోవాలనుకుంటే..

కార్డులను రద్దు చేసుకునే ముందు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకటి కన్నా ఎక్కువ కార్డులున్నప్పుడు, వాటిలో కొన్ని తీసివేద్దామనుకుంటే ఈ నిర్ణయం తీసుకోవాలి. వార్షిక చార్జీలు ఎక్కువగా ఉన్న కార్డును తీసేయ్యడం మంచింది. అలాగే క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉన్న వాటిని, ఆఫర్ల లేని వాటిని రద్దు చేసుకోవడం మంచిది. ఏది ఏమైనా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం ఉండకూడదు.




 ఇక్కడ క్లిక్ చేయండి..

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top