Search This Blog

Thursday, June 13, 2024

అన్ని సంఘాల యొక్క ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సంబంధించినటువంటి సంఘాల ప్రధాన బాధ్యులతో టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ సొసైటీ ఆఫీస్ లో సమావేశం

 అన్ని సంఘాల యొక్క ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సంబంధించినటువంటి సంఘాల ప్రధాన  బాధ్యులతో టీఎస్ డబ్ల్యూ ఆర్ ఐ సొసైటీ ఆఫీస్ లో సమావేశం కొనసాగినది. 

గౌరవ కార్యదర్శి గారు సీఎం గారితో సమావేశం ఉండడం వల్ల చాలా విషయాలను విశదీకరించి సంఘ నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుని వెళ్లడం జరిగింది. 

కార్యదర్శి గారు చెప్పినటువంటి విషయాలు. 

1. గురుకుల జేఏసీ- టీగారియా చేసిన ప్రాతినిధ్యాన్ని పరిగణలోకి తీసుకొని రాబోయే ప్రిన్సిపాల్ సెలెక్షన్స్ లో ఇంటర్వ్యూ లను రద్దు చేస్తూ కేవలం సీనియారిటి ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టం చేయడం జరిగింది. అందుకు గౌరవ కార్యదర్శి  గారికి, మరియు ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి గురుకుల జేఏ సీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నది.

కార్యదర్శి గారు చెప్పిన మరికొన్ని విషయాలు. 

1. జూన్ 14 2024 నాటికి అన్ని టెన్టేటివ్ సీనియర్ లిస్టులు  డిస్ప్లే చేయబడతావి.

2. మూడు రోజులు సమయమిచ్చి జూన్ 18వ తారీకు వరకు అన్ని సీనియర్ లిస్టులో ఫైనల్ చేయబడతాయి.

3. 317 జీవో అప్లికేషన్ ప్రకారము సీనియర్ ఫైనల్ చేయబడతవి.

4. 88 మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లి నవారు ప్రస్తుతం వారు ఉన్నటువంటి ప్రదేశము మరియు జోన్ లో మాత్రమే కంటిన్యూ చేయ చేయబడతారు. 

5.   కోర్టు తుది తీర్పు వచ్చినంత వరకు స్టేటస్కో మల్లో ఉంటుంది కాబట్టి వారికి బదిలీలలో గాని ప్రమోషన్స్ లో గాని పరిగణ లోకి తీసుకునే అవకాశం లేదు. 

6. త్రీ వన్ సెవెన్ పోస్టింగ్స్ లో కానీ, ప్రమోషన్స్ అప్పుడు కానీ, సాధారణ బదిలీలప్పుడు కానీ అన్ని పోస్టు లు అన్ని వేకెన్సీ లు డిస్ప్లే చేయబడతాయి. 

ఏ పోస్టు కూడా బ్లాక్ చేయబడదు. సి ఓ ఈ పాఠశాల/ కళాశాలలో పోస్టు కూడా డిస్ప్లే చేయబడతావి.

7. 317 అల్లోకేషన్, ప్రమోషన్స్ తర్వాత పోస్టింగ్స్ అన్నీ కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 

8. 20 జూన్ 2024 నుండి నూతనంగా నియమించబడ్డ వారికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ స్టార్ట్ చేయబడుతుంది. జూలై ఫస్ట్ వరకు ఉత్తర్వులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

9. జూలై ఫస్ట్ లోపల 317 , ప్రమోషన్స్, మరియు బదిలీలు అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. 

10. నూతనంగా రెగ్యులర్ అయితే అయినా కాంట్రాక్టు టీచర్లకు కూడా 317 అలికేషన్ చేస్తూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది. 

11. టి గారియ తరపున డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ డిప్యూటేషన్ ఆన్నీ రద్దు చేయాలని అదేవిధంగా ఏ పోస్టు కూడా బ్లాక్ చేయకుండా అన్ని డిస్ప్లే చేయాలని మరియు మొదట 317 వారికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ప్రమోషన్స్+బదిలీలు ఒకేసారి చేయాలని విజ్ఞప్తిని గౌరవ కార్యదర్శి గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. 

మిత్రులారా! ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే గౌరవ కార్యదర్శి గారు నిర్ణయించినట్టు జూన్ 14 2024 నుండి షెడ్యూల్ ప్రారంభమై ఒకటో తారీకు వరకు ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. 

మరియు నూతన పోస్టింగ్స్ పొందినటువంటి వారు కూడా జూలై ఫస్ట్ లోపల ఉద్యోగంలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నవి. 

మన యొక్క చిరకాల సమస్య సీనియారిటీ ప్రాతిపదికనే ప్రిన్సిపాల్ ప్రమోషన్ ఇవ్వాలి అని డిమాండ్ ను అంగీకరిస్తున్నటువంటి యాజమాన్యానికి ప్రభుత్వానికి మరియు జూలై ఫస్ట్ లోపల అన్ని క్లియర్ చేయాలని ప్రయత్నంలో ఉన్నటువంటి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 

డాక్టర్ మధుసూదన్ 

ఎస్ గణేష్ 

బిక్షం యాదవ్ 

శ్రీమతి శారద 

శ్రీమతి శ్రీదేవి. 


14 జూన్ 2024 అన్ని క్యాడర్ల యొక్క సీనియార్టీ లిస్టు డిస్ప్లే చేయబడతాయి.



TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top