Search This Blog

Thursday, March 21, 2024

ఏ బంధం అయినా ఒక స్టేజ్ కి వచ్చేసాక Friends లా వుండాలి...

🍃 🪷 ఏ బంధం అయినా ఒక స్టేజ్ కి వచ్చేసాక Friends లా వుండాలి...

అది తల్లిదండ్రులు పిల్లలైనా, అక్కా చెల్లి, అన్నా తమ్ముడు, మొగుడు పెళ్ళాలు ఎవ్వరైనా, ఏ బంధమైనా, ఏ రిలేషన్ అయినా గానీ Friends లా వుండండి...

ఇప్పటి పరిస్థితులకి ఈ పద్ధతి మెయింటైన్ చేయటం ఇంకా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు అన్ని బంధాల్లో ఒకరితో ఒకరికి మానసిక సంబంధాలు తెగిపోతున్నాయి, ఇద్దరి మధ్య అడ్డుగోడలు, ఆహాలు, నిర్లక్ష్యం, ఆధిపత్య పోరు, ఇవే జరుగుతున్నాయి తప్ప ఏ బంధాలు బంధాలు లాగా ఉండట్లేదు...

అందుకే ఫ్రెండ్స్ లా ఉండటం తప్ప ఇంకో దిక్కు లేదు ఈ ఈ బంధాలకి, మనుషులకి...

ఎందుకంటే స్నేహంలో అహం ఉండదు, ఆధిపత్య పోరు ఉండదు, నిర్లక్ష్య ధోరణి ఉండదు, కేవలం ఒకరి వల్ల ఒకరు సేదతీరడం మాత్రమే ఉంటుంది, 

ఇద్దరి మధ్య స్వేచ్ఛ ఉంటుంది, ఇద్దరిలో ఒకరు మీద ఒకరికి ఆరోగ్యకరమైన అందమైన సానుకూలమైన(Positivity) భావన ఉంటుంది, ఎవరి Ego లూ దెబ్బ తీసుకోని ఓపెన్ గా ఉండే చనువు ఉంటుంది..!! 

బాధలు కష్టాలు కన్నీళ్లు అన్నీ మర్చిపోయి హాయిగా గడిపే ఆహ్లాదకరమైన మనోభావం ఉంటుంది, ఏ కష్టమైనా నష్టమైనా కన్నీళ్లయినా పంచుకునే మీ  మనసుకి ఏ అడ్డుగోడలు లేని స్వేచ్ఛ ఉంటుంది...

అందుకే సృష్టిలో అందమైనది స్నేహం అంటారు!! ఇందులో ఒకరితో ఒకరికి అవసరాలు ఉండవు అభిమానాలు తప్ప, ఆహాలు ఉండవు అందమైన భావోద్వేగం తప్ప, హద్దులు ఉండవు చదువు తప్ప, నిర్లక్ష్యం ఉండదు ఆపేక్ష తప్ప, బాధలు ఉండవు హాయి తప్ప...

మనిషికి మనిషికి మధ్య పొంతన కుదిర్చేది స్వాంతన చేకూర్చేది, ఏ అడ్డుగోడలు లేకుండా అన్నీ పంచుకునే ధైర్యం ఇచ్చేది, కేవలం తనని తనలా అంగీకరించే స్వేచ్ఛ మాత్రమే!! ఆ స్వేచ్ఛ స్నేహంలోనే దొరుకుతుంది..!!

అందుకేనేమో నేను ఆ స్వేచ్ఛ ఇస్తా కాబట్టేనేమో ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వాళ్ళ వరకు నాతో చాలా ఫ్రీ గా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు తమ మనసులో భారం మొత్తం దించేసుకుని రిలాక్స్ అవుతారు...

అందుకే బంధాలు అంటే బందిఖానా అన్నట్టు ఒకరినొకరు హింసించుకుంటూ కష్టపెట్టుకుంటూ ఉండకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండండి...

అప్పుడు మీకు తెలియకుండానే మీ బంధంలో చాలా ఇరకాటాలు అడ్డుగోడలు తప్పిపోయి, అభిమానాలు ఆప్యాయతలు స్వేచ్ఛ సానుకూలత (Positivity) పెరుగుతుంది...

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top