Search This Blog

Saturday, February 17, 2024

గురుకుల కార్యదర్శి గారితో జేఏసీ చర్చలు. త్వరలో ప్రమోషన్స్ మరియు బదిలీలు. Dated:-17-02-2024

 



గురుకుల కార్యదర్శి గారితో జేఏసీ చర్చలు. త్వరలో ప్రమోషన్స్ మరియు బదిలీలు.

గురుకుల జేఏసీ నాయకత్వం ఈరోజు టి ఎస్ డబ్ల్యు మరియు టి టి డబ్ల్యూ సంస్థల కార్యదర్శి గారు శ్రీమతి సీతాలక్ష్మి ఐఏఎస్ గారిని కలిసి గురుకులాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి ప్రమోషన్స్ మరియు బదిలీలు ఇవ్వకుండా నూతన అపాయింట్మెంట్స్ వారికి పోస్టింగ్ ఇవ్వడం వల్ల సీనియర్స్ చాలా నష్టపోతారని కార్యదర్శి గారి దృష్టికి తేవడం జరిగినది. ఈ విషయంలో ఎన్నో ఉదాహరణలు సంస్థ కార్యదర్శి గారికి జేఏసీ సమర్పించిన పిదప జేఏసీ అభిప్రాయంతో సంస్థ కార్యదర్శి గారు పూర్తిగా ఏకీభవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రమోషన్స్ బదిలీలు చేయుటకు కృషి చేస్తున్నట్టు ఇందుకు  గల అన్ని అడ్డంకులను తొలగించుటకు చర్యలు తీసుకుంటున్నామని త్వరలో నూతన పోస్టింగ్స్ కంటే ముందే ప్రమోషన్స్ మరియు బదిలీలు నిర్వహించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అందుకు జేఏసీ నాయకత్వం తమ మద్దతు మరియు సహకారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నది. 

త్వరలో గురుకులాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ వర్గం ప్రమోషన్స్ మరియు బదిలీలు ఉత్తర్వులు పొందుతారని జెఎసి విశ్వాసం వ్యక్తం చేస్తున్నది. 

జేఏసీ ప్రతినిధులు.

మామిడి నారాయణ

DR MADHU SUDHAN

A నర్సింలు గౌడ్

S GANESH

BIXAM YADAV.


















CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top