Search This Blog

Tuesday, January 3, 2023

సావిత్రిబాయి పూలే

సామాజిక ఉద్యమకారిణి
ఆధునిక భారతదేశంలోనే స్త్రీలకు, స్వేచ్ఛ, సమానత్వం, గౌర వం లేని రోజుల్లో విద్య నేర్చుకొని, ఆ విద్యను పదిమందికి నేర్పించి, సమాజంలో స్త్రీలు అన్నిరంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు. రాయగలరు, పోరాటం చేయగలరు అని నిరూపించిన దార్శనికురాలు 'సావిత్రిబాయి పూలే', మహారాష్ట్రలో శూద్రకులంలో సావిత్రి బాయి పూలే 1.1.1831 న జన్మించారు. భర్త, మహాత్మా జోతిరావ్ పూలే ఆధునిక భారతదేశంలో 'మహాత్ముడు', శూద్రులు అతిశూద్రులు హక్కులకొరకు నిరంతరం ఉద్యమించిన పోరాటయో ధుడు. సావిత్రి బాయి పూలేకు సంవత్సరాల వయస్సు అప్పుడే వివాహం అయింది జోతిరావ్ పూలేతో.
స్త్రీ స్వాతంత్య్రమునకు అనర్హురాలు. (మనుస్మృతి 5 147,148) గ్రీకి ఏ స్వతంత్ర్యంలేని రోజుల్లోనే జోతిరావ్ పూలే భార్య సావిత్రి బాయిపూలే ఎన్నో సామాజిక కార్య క్రమాలు, సాంఘిక విప్లవాలు జరిపింది. శూద్రులకు అతిశూద్రులకు, చదువు చెప్పడానికి వెళ్ళేట లను ఎదుర్కొంది. అయినా సావిత్రిబాయి ఫూలే పోరాటం వదలలేదు. ఏ సభ్య సమాజం సంకెళ్ళు విధించిందో ఆ సంకెళ్ళు. తెంపి, స్త్రీల విద్యకోసం, హక్కులకోసం, స్వేచ్ఛకోసం నిరంతరం ఉద్యమిం చింది. స్త్రీలకు విద్య ఎందుకు? అని హేళనచేసిన వారికి సరైన బుద్ధిచెప్పింది. సావిత్రిబాయి పూలే. భారతదేశంలో శూద్రకులంలో పుట్టిన స్త్రీ చదవడమంటే మామూలు విషయంకాదు. కరడుగట్టిన మనుస్కృతి భావజాలంతో, స్త్రీలు భర్త చెప్పుచేతల్లోనే వుండాలి. స్త్రీలు వంట ఇంటికే పరిమితం, భర్త చనిపోయే చితి మంటలో వేయడం లాంటి, మూఢాచారాలు రాజ్యమేలే రోజుల్లో శూద్ర, స్త్రీ ఇంతటి చదువు చదివింది అంటే మాటలు కాదు. అతి శూద్ర కులంలో స్త్రీలకు
ప్పుడు ఎన్నో అవమానాలను ఎన్నో సంఘటన (నేడు సావిత్రిబాయి పూలే జయంతి)
చదువు చెప్పడం కొరకు, ఇండ్లకు వెళ్ళిరావడం, వారిలో చైతన్యం నింపడం, చదువు అవసరం తెలపడం లాంటివి సావిత్రిబాయి లే చేస్తూవుండేది. భర్త జోతిరావ్ పూలేతో పాటు, సావిత్రి బాయి పూలే కూడా ఎన్నో మహాపోరాటాలలో పాలుపంచుకుంది.
జోతిరావ్ పూలే 1848లో శూద్రులకు అతి శూద్రులకు పాఠశాల ప్రారంభించినప్పుడు, సావిత్రిబాయి పూలే స్కూలులో పిల్లలకు పాఠాలు బోధించేది. ఈ స్కూలులో భారతదేశంలో శూద్రులకు అతిశూద్రుల కొరకు స్థాపించిన మొట్టమొదటి స్కూల్. సావిత్రి బాయి ఫూలే శూద్రులకు అతిశూద్రులకు విద్య నేర్పించడం విన్న. చూసిన అగ్రవర్ణంవారు ఒక్కసారి సావిత్రిబాయి పూలే మీద బుర దచల్లి, రాళ్ళువిసిరి, అనరాని మాటలు అని, తిట్టులు తిట్టి, అవహే ళన చేసారు. విద్య అతిశూద్రులకు అనర్హం. వారికి చదువు నేర్పడం
మహాపాపం అనీ, నువ్వు పాపం చేస్తున్నావు అనీ సావిత్రిబాయి పూలేను అవమానించారు. అయినా ఆ మహాత్మురాలు పోరాటం ఆపలేదు. భర్త చేసిన పోరాటం, ఏ సమాజ మార్పు కోసం, ఇల్లువదలి, సుఖసంతోషాలు వదిలి వచ్చారో ఆ కార్యం నెరవేరేవరకు ఈ పోరాటం ఆగదు అనుకొని జోతిరావ్ పూలేతో పాటు ఉద్యమం చేసిన స్త్రీ ఎవరైనా వున్నారంటే అది సావిత్రిబాయి. పూలేనే.
శూద్రులు ఆతిశూద్రులనే కాకుండా బ్రాహ్మణ స్త్రీలను కూడా ఆదరించింది. బ్రాహ్మణకులంలో భర్తచనిపోయిన తరువాత భార్యను చితిమంటలోనే వేసే వాటిని నిరసించింది. అగ్రవర్ణ వితంతువులను చేరదీసి వారికి కొత్త జీవితాలను ఇచ్చారు. సావిత్రిబాయి పూలే, జోతిరావ్. ఇవి ఏవికూడా కొంతమంది అగ్రవ ం వారికి నచ్చక వీరిపై ఎన్నో నిందలు, దాడులు జరిపారు. అయినా వీరి వ్యక్తి
త్వం ముందు అవి ఏవీ కుదరలేదు. ఇదే సమయంలో వితం తువులకోసము, వారి పిల్లల కోసం, జోతిరావ్ శరణాలయా లను స్థాపించాడు. దీనిలో కూడా సావిత్రిబాయి పూలే సేవలు చేసింది. వితంతువులు ప్రసవానికి ఇక్కడికే వచ్చే వారు. ఇదికూడా అగ్రవర్ణం వారికి నచ్చక ఈ పనికూడా జోతిరావ్ చేసివుంటాడని మండిపడ్డారు. జోతిరావ్ పూలే 1873లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేస్తే, భర్తతో పాటు సమాజసేవలో పాల్గొంది సావిత్రిబాయి పూలే. సత్యశోధక్ సమాజ్ 187877, 1896-97 మహా రాష్ట్రలో సంభవించిన కరవుకాటకాల సమయంలో ఈ సత్యశోధక్ సమాజ్ చేసి నసేవ, ముఖ్యంగా సావిత్రిబాయి ఫూలే చేసి న సేవ ఎవరూ మరువరు. శూద్ర అతిశూద్ర కులంలోనే కాదు, భారతదేశం, ప్ర పంచంలోనే ఇంత సేవచేసిన మాతృమూర్తి మహాత్మురాలు మనకు కనబడదు.
భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి సామా జిక ఉద్యమకారిణి, మొట్టమొదటి రచయిత్రి సావిత్రిబాయి పూలేనే. ఎన్నో రచ నలు, కవితలు, కావ్యాలు రాసి మూఢనమ్మకాలను బద్దలు చేయడానికి పూను కున్న పుణ్యాత్మురాలు సావిత్రిబాయి పూలే. జోతిరావ్ పూలే అనారోగ్యంతో 1890 లో మరణించిన, భర్త చేపట్టిన కార్యక్రమాలను చేపడుతూ ఎన్నో సేవలు చేసింది. సావిత్రిబాయి పూలే ప్లేగ్ వ్యాధి బారిన పడినవారికి సేవలు చేస్తూ, సావి త్రిబాయి పూలేకు కూడా ఆ వ్యాధి సోకింది. అయినా ప్రాణాలు లెక్క చేయ కుండా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ స్త్రీలకు ఆదర్శంగా నిల్చింది. ఈ రోజుల్లో కొద్దిగా సేవచేసి బిరుదులు పెట్టుకునేవారు ఆలోచించాలి.
ప్లేగ్ వ్యాధి వారికి సేవచేస్తూ ఆ వ్యాధి సోకి సావిత్రిబాయి పూలే 10.3.1807 న మరణించింది. స్వాతంత్ర్యం రాని రోజుల్లోనే, కులాధిపత్యాలు ఏలే రోజు ల్లోనే, స్త్రీలకోసం, సమానత్వం కొరకు, ప్రజలసేవకై ప్రాణాలు సలిపిన త్యాగ మూర్తుల జోతిరావ్ పూలే సావిత్రిబాయి పూలేకు భారతరత్న బిరుదులు ఇచ్చి గౌరవించవలసిన పాలకవర్గాలు మరిచినాయి. రాజకీయ నాయకులు, మేధా వులు, రచయితలు, ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం, అడగకపోవడం, సిగ్గుచేటు, దారుణం. ఇప్పటికైనా ఆలోచించండి మేధావులారా,
- తంగిరాల సోని (తేరు) -




TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top