Search This Blog

Wednesday, August 3, 2022

Heart Attack: మధుమేహం అదుపులో లేకపోతే ముప్పు

Heart Attack: మధుమేహం అదుపులో లేకపోతే ముప్పు

Heart Attack: మధుమేహం అదుపులో లేకపోతే ముప్పు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధుమేహం అంతుచిక్కని వ్యాధి. ఏదీ తిన్నా తినకపోయినా, అదుపులో ఉన్నా గుండె, కిడ్నీలకు ప్రమాదకారిగా మారుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ జవసత్వాలు లేకుండా చేసే మధుమేహం ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.  మధుమేహుల్లో ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతారని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కార్డియాలజిస్టు డాక్టర్‌ రమేష్‌ గూడపాటి వివరించారు.

అదుపులో ఉంటేనే కొంత మేలు

మధుమేహం అదుపులో ఉంచుకోవడంతో పాటు ఆహార నియమాలను పాటించాలి. ఇలా వున్నా ఒక సమయంలో వీరికి కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షుగర్‌ నియంత్రణలో ఉన్నా ఇతరుల కంటే వీరికి గుండె సంబంధ సమస్యలు అధికంగా వస్తాయి.  తీపి జబ్బును అదుపులో పెట్టుకుంటూనే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. వీళ్లు పొగతాగొద్దు. వ్యాయామాన్ని మరవకుండా చేయాలి.