Search This Blog

Tuesday, August 23, 2022

Health Tips: షుగర్ పేషెంట్లకి ఈ పండ్లు ఒక వరం.. అవేంటంటే..?

Health Tips: షుగర్ పేషెంట్లకి ఈ పండ్లు ఒక వరం.. అవేంటంటే..?

These Fruits are a Boon for Diabetic Patients
Highlights

Health Tips: భారతదేశంలో షుగర్ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.


Health Tips: భారతదేశంలో షుగర్ పేషెంట్లు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు ఏవి తినాలో ఏవి తినకూడదో సరిగ్గా తెలియదు. పెద్ద గందరగోళంలో ఉంటారు. మధుమేహ బాధితుల శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కానందున రక్త ప్రవాహంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. ఫలితంగా వారి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇది వారి ఆరోగ్యానికి క్రమంగా క్షీణింపజేస్తుంది. అందుకే తరచుగా రక్తంలో చక్కెర శాతాన్ని చెక్ చేసుకుంటూ డైట్ మెయింటెన్ చేయాలి. అంతేకాదు చాలామంది షుగర్ పేషెంట్లు పండ్లు తినడానికి భయపడుతారు. కానీ అన్ని పండ్లు చక్కెర శాతాన్ని పెంచవు. షుగర్ పేషెంట్లు తినే కొన్ని పండ్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

జామ: జామ పండులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు కలిగిన పండు. టైప్ 2 డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది. సులభంగా జీర్ణం అవుతుంది. ముఖ్యంగా సి విటమిన్‌ని అధికంగా అందిస్తుంది.

బ్లాక్ ప్లం: బ్లాక్ ప్లం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అలాగే నేరేడు పండు రసాయనాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిండి పదార్థాన్ని శక్తిగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఇవి ఎక్కువగా తీసుకోవాలి.

యాపిల్స్: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో యాపిల్స్ బాగా పనిచేస్తాయి. ఇందులో పాలీఫెనాల్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి దోహదం చేస్తాయి. అందుకే ఇవి కూడా తినవచ్చు.

బెర్రీలు: అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం బెర్రీలలో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటీస్ పేషెంట్లకి బాగా ఉపయోగపడుతాయి. అలాగే వీరు ఎక్కువగా పీచు ఉండే పళ్లని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Web TitleThese Fruits are a Boon for Diabetic Patients

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top