Search This Blog

Friday, July 22, 2022

కుటుంబం అంటే కండ్ల ముందు కదలాడే పండ్ల బుట్ట... ప్రతి పండు మాధుర్యాన్ని ప్రత్యేకతను అనుభవించాలి ఆస్వాదించాలి -

కుటుంబం అంటే కండ్ల ముందు కదలాడే పండ్ల బుట్ట... ప్రతి పండు మాధుర్యాన్ని ప్రత్యేకతను అనుభవించాలి ఆస్వాదించాలి ----//

పండ్లను తీసుకొని తినే విషయంలో కష్టనష్టాలు  వ్యయ ప్రయాసలు ఎన్ని ఉన్నా ఇష్టపూర్వకంగా అనుభవించి తిన్నట్లుగానే.... మన కుటుంబంలోని సంబంధ బాంధవ్యాల్లో ఎన్ని ఒడిదుడుకులు మంచి చెడులు ఉన్నా... వాటిని  పట్టించుకోకుండా..అందరితో కలిసిగడిపే అవకాశాన్ని సంపూర్ణంగా అనుభవించాలి... అందరితో పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించాలి...

ఎలా అంటే.... అరటిపండును తొక్క తీసేసి తింటాం....సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.....సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని , పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం....ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.....జామ పళ్ళని మొత్తం తినేస్తాం...

ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం...

ఒక్కోటి ఒక్కో రుచి.....తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు...అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే...

అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు...మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే గాని పండ్లను పట్టించుకోకుండా తినకుండా వుండం.....అలాగే కుటుంబంలోని మనుషులు కూడా పళ్ళలాంటివారు....

కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు...ఒకొక్కరిది ఒక్కో స్వభావం... అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే...

అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది... 

పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?....కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు..వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప... చిరాకుపడo కదా!!?....

పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం....ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం....

కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!!... ప్రతి పండులో తొడిమలు తొక్కలు గింజలు లాంటివి  పనికిరానివి ఎన్ని ఉన్నా... పనికిరాని వాటిని పట్టించుకోకుండా... పండ్లను ప్రేమిస్తూ తింటూనే ఉంటాం...

అలాగే కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ... శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ... అందుకే , కుటుంబం అంటే కండ్ల ముందు కదలాడే పండ్ల బుట్ట... పట్టింపులు లేకుండా ప్రతి పండు మాధుర్యాన్ని ప్రత్యేకతను అనుభవించాలి ఆస్వాదించాలి ----//-

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top