Search This Blog

Tuesday, July 5, 2022

అధిక కొలెస్ట్రాల్ ఉందని చెప్పే సంకేతాలు ఇవే..

  • కాళ్లల్లో తిమ్మిర్లు, నొప్పులు, మంటలు
  • పుండ్లు పడి మానకపోవడం
  • చర్మం రంగు మారడం సంకేతాలే
  • వైద్యుల సలహాతో సమస్యకు పరిష్కారం  

అధిక కొలెస్ట్రాల్ మరణాన్ని తీసుకొచ్చే మహమ్మారి. దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. నిర్లక్ష్యం అస్సలే పనికిరాదు. మధ్య వయసు నుంచి కొలెస్ట్రాల్ రిస్క్ పెరుగుతుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం కొవ్వులుగా మారతాయి. ఇందులోనూ మంచి, చెడు కొవ్వులు అని ఉంటాయి. మోతాదు మించిన చెడు కొవ్వులు రక్త ప్రవాహ మార్గంలో అవరోధంగా మారతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ బారిన పడతారు. 

ముఖ్యంగా లో డెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్డీఎల్/చెడు కొలెస్ట్రాల్) ధమనుల గోడలకు అతుక్కుపోతుంది. అలా పెరిగిపోయిన ఎల్డీఎల్ రక్త ప్రవాహ మార్గాన్ని ఏదో ఒక రోజు పూర్తిగా మూసేస్తుంది. దాంతో గుండెకు రక్తం అందదు. ఫలితంగా గుండె చేతులు ఎత్తేస్తుంది. అధిక ఫ్యాట్ ఉండే పదార్థాలు తినడం, ఆల్కహాల్ సేవనం ఈ రెండూ ఎల్డీఎల్ పెరిగేందుకు ఎక్కువ కారణం అవుతాయి.

మనకు అధిక కొలెస్ట్రాల్ ఉందని తెలుసుకోవడం ఎలా..? ఇందుకు సిరమ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటుంది. 12 గంటల ఫాస్టింగ్ తర్వాత చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. ఇందులో మనకు హాని చేసే కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్, మంచి కొలెస్ట్రాల్ ఎంతున్నది తెలుస్తుంది.

కొన్ని సందర్భాల్లో మన శరీరం విడుదల చేసే సంకేతాలు కూడా కొలెస్ట్రాల్ ఉందని తెలియజేస్తాయి. ధమనుల్లో (గుండె నుంచి మంచి రక్తాన్ని తీసుకెళ్లేవి) కొవ్వులు పేరుకుపోవడాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (ప్యాడ్) అంటారు. ఇలా అధిక కొవ్వులు పేరుకుపోవడం వల్ల కాళ్లకు రక్త  సరఫరా తగినంతగా ఉండదు. కాళ్లలో నొప్పులు, మంటలు, గ్యాంగ్రీన్ (కాలి కణజాలం దెబ్బతినడం) కనిపిస్తాయని బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ తెలిపింది.

ప్యాడ్ లక్షణాలు
కాళ్లకు ఉన్న వెంట్రుకలు రాలిపోవడం, కాళ్లలో బలహీనత, తిమ్మిర్లు, కాలి వేలి గోళ్లు నిదానంగా పెరగడం, పుండ్లు ఏర్పడి మానకపోవడం, చర్మం రంగు మారడం, మగవారిలో అయితే అంగస్తంభన లోపించడం, కాలి కండరాలు సంకోచించడం ప్యాడ్ లక్షణాలుగా బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ తెలిపింది. 

రిస్క్ తగ్గించుకోవడం
ఈ సంకేతాలు ఏవైనా కనిపించినా లేక వయసు 40 దాటినా ఒకసారి వైద్యుల వద్దకు వెళ్లి కొలెస్ట్రాల్, హార్ట్ స్క్రీన్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణాలు కనిపించాలని లేదు. అందుకుని వైద్యుల సలహా తీసుకోవాలి. 

చికిత్స
కొలెస్ట్రాల్ స్థాయులు అధికంగా ఉంటే, వైద్యులు మందులు సూచిస్తారు. దీనికి అదనంగా తీసుకునే ఆహారంలో మార్పులు, శారీరక వ్యాయామాలను సిఫారసు చేస్తారు. 

CLICK BELOW TO JOIN IN OUR TGARIEA

MOTIVATIONAL VIDEOS

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top