పిల్లల పెళ్లిళ్ళ తో బాధ్యతలన్నీ తీరిపోయాయి, పిల్లలు కూడా మంచి ఉద్యోగాలలో స్ధిరపడ్డారు, ఇక నాకు ఎటువంటి చీకూ, చింతా లేదు.. అయినా మనసులో ఏదో మూల చిన్న కొరత.. ఏంటో అర్థం కావడం లేదు.. ఆ చిన్న కొరత పెరిగి పెద్దదై నిద్ర రాని పరిస్థితి కి వచ్చింది .. నన్ను ప్రేమగా చాచా అని పిలిచే ప్రసిద్ధ వైద్యుని దగ్గరకు వెళ్లి నా బాధనంతా చెప్పుకున్నాను.. ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని...ఆ డాక్టరు అంత బిజీలో కూడా ఓపికగా నా బాధనంతా విని చిన్నగా నవ్వి ప్రిన్స్క్రిప్షన్ రాసి నా చేతిలో పెడుతూ చాచా! ఇది ఉంచండి అని నా చేతులో పెట్టాడు.. నేను ధన్యవాదాలు తెలిపి ఆ మందులచీటీ తీసుకుని మెడికల్ స్టొర్ కు వెళ్ళి షాపతనికి ఇచ్చాను.. అతను చదివి సార్ ఇవి మందులు కాదు అని వెనక్కి ఇచ్చాడు.. నేను ఆశ్చర్యంగా ఆ మందుల చీటీ తీసుకూని చదవగా అందులొ చాచా! మీరు వెంటనే నీ పాత స్నేహితుల వద్దకు వెళ్ళండి...వారితో కలసి బాతాఖానీ కొట్టండి.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకోండి.. వారే మీకు తగిన వైద్యులు, వారే వారి మాటలతో మీకు చికిత్స చేస్తారు.. వయస్సు అనే వస్త్రాన్ని మీ వంటిపై నుండి ఇట్టే లాగేస్తారు.. వృద్ధాప్యం ను మీదరికి రానీయరు,వారితో కలసి ఉన్నంతవరకు మీరు నిత్య యవ్వనులే..
ఇదే మీ సమస్య కు పరిష్కారం అని రాసి ఉంది...నిజమే!
మనకు ఎంతటి అధికారం, హోదా ఉన్నా అందరూ మనకు సార్, సార్ అని ఒంగి, ఒంగి దండాలు పెట్టినా కలగని తృప్తి పాత స్నేహితుడు దారిలో కనబడి ఒరేయ్ మామా! నీయబ్ఫ ఆగరా! అన్న పిలుపులో కనపడుతుంది.. బంధువులు, పిల్లలు మన ఆస్తులు,వీలునామా ను అడుగుతారు.. కానీ ఒక్క స్నేహితుడు మాత్రమే నీ క్షేమం అడుగుతాడు.. అందువల్ల మిత్రులారా! మనతో పాటు చదివిన మన పాత మిత్రులను మనం ఎప్పుడో ఒకప్పుడు ఊరికి పోయినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా పలకరించకుండా... వాడు మారిపోయాడ్రా అనే భావన వారిలో కలగకుండా వారానికి ఓసారి లేదా 15 రోజులకు ఒకసారి వారితో ఫోన్ లో నైనా పలకరిస్తూ స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిద్దాం...
వృత్తి లో పరిచయమైన మిత్రులు బంగారం లాంటి వారైతే పాత మిత్రుడు ఎప్పటికీ వన్నె తగ్గని వజ్రం లాంటి వాడు.. జీవితం మొదలునుండి చరమాంకం వరకు ఎప్పటికీ వన్నె తగ్గని స్వచ్ఛమైనది బాల్యమిత్రుల స్నేహం..
వారిని మరవద్దు !