Search This Blog

Monday, June 14, 2021

LEAVE TRAVEL CONCESSION

LEAVE TRAVEL CONCESSION


ప్రభుత్వ ఉద్యోగి సెలవుపై అతని కుటుంబంతో కలిసి ఉద్యోగ ప్రవేశము (హెడ్ క్వార్టర్స్) నుండి స్వస్థలము (హౌమ్టౌన్)నకు గాని, రాష్ట్రంలోని ఏ ప్రదేశమునకైనా గాని వెళ్లి వచ్చుటకు అగు ప్రయాణ ఖర్చులను చెల్లించుటనే "లీవ్ ట్రావెల్ కన్పెషన్" (LTC) అంటారు.
1).అర్హత : 5 సం కనీస సర్వీసు గల టెంపరరీ ఉద్యోగులతో సహా ఉద్యోగులందరూ అర్హులు. కంటిన్జెంట్ సిబ్బంది. పార్ట్టైమ్ ఉద్యోగులు దీనికి అర్హులు కారు.
2) స్వస్థలము : (ఎ) ఉద్యోగి జన్మస్థలం లేదా ఆతని తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు నివసించి ఉన్న స్లలము లేదా ఉద్యోగి స్థిరాస్తి కలిగియున్న స్థలం, ఉద్యోగంలో చేరకముందు నివాసమున్న స్థలము స్వస్థలముగా పరిగణింపబడుతుంది. ఉద్యోగి తాము మొదటిసారిగా (LTC) వాడుకునేముందు స్వస్థలమును ధృవీకరిస్తూ నిర్ణీత ఫారములో డిక్లరేషన్ ఇవ్వాలి. వారు దానిని సర్వీసు రిజిస్టర్  లో నమోదు చేస్తారు. ఈ డిక్లరేషన్ను సర్వీసు మొత్తంలో ఒకసారి మార్చుకోవచ్చు. (అనుమతించు ఆధికారుల పట్టిక G.O.Ms.No.40 Edn. Dt: 7-5-2002] లో ఇవ్వబడినది.

(బి ) దేశంలో ఎక్కడికైనా  G.0.M.S.No.76, Fin Dt 13-5-2015 అనుసరించి సర్వీసులో ఒక్కసారి 3500 కి.మీ. 18,750/- లకు మించకుండా చెల్లించబడును.

3) కుటుంబము : టి.ఎ. నిబంధనలలో నిర్వచించబడిన కుటుంబమే దీనికి కూడా వర్తించును. ఉద్యోగి, అతని కుటుంబము వేర్వేరుగా గానీ, కలిసి గానీ (LTC) వాడుకోవచ్చు, ఉద్యోగి కుటుంబం వేరే చోట నివాసముంటుూ ఈ సౌకర్యం ఉపయోగించుకోకపోతే అట్టి ఉద్యోగి స్వప్థలం వెళ్ళి వచ్చుటకు (UTC) వాడుకోవచ్చును. కలిసి  వాడుకునేటప్పుడు ఒక్కరే (LTC) కి అర్హులు. కుటుంబ సభ్యులు ఒక బ్లాక్ పీఠియడ్లో ఒకసారి (LTC) కి అర్హులు. ఈ సౌకర్యం సంతానంలో ఇద్దరికి పరిమితం చేయబడినది.

4) బ్లాక్ పీరియడ్ : ప్రభుత్వంచే నిర్ణయింపబడిన 4 సం॥కాలము ఒక బ్లాక్ పీరియడ్ గా  పరిగణింపబడుతుంది. ప్రతి
సం|లో మొదటి బ్లాక్ పీరియడ్ (2సం॥లు) నందు స్వస్థలం పోవుటకును, రెండవ బ్లాక్ పీరియడ్ నందు రాష్ట్రంలో ఏ
ప్రదేశమునకైనా గానీ వెళ్ళి వచ్చుటకు (LTC) ని వినియోగించుకోవచ్చును. (G.O.No.151 Fin4-5-2010) ప్రకారం దేశంలోని ఏ ప్రదేశమునకైనా (LTC) సైన నెళ్ళవచ్చును. ఛార్జీ మాత్రం రాష్ట్రంలోని చివరి పాయింట్ వరకు చెల్లిస్తారు.

5) తీసుకోవలసిన సెలవు : క్యాజువల్ లీప్ గానీ, లేక అర్హత గల ఏ ఇతర సెలవులుగాని పెట్టుకొని వెళ్ళాలి. అర్హత సెలవు మంజూరు చేయు అధికారి నుండి LTC వాడుకొనుటకు ముందుగాని పర్మిషన్ పొందాలి. వెకేషన్ డిపార్టుమెంటు చెందిన వారు (వెకేషన్) వేసని సెలవులలో, దసరా, సరిక్రాంతి సెలవులలోను కూడా ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చును .

6) అడ్వాన్స్ : LTC పై వెళ్ళి వచ్చుటకు గాను అంచనా వేయబడిన మొత్తం ఖర్చు లో 80% వరకు  అడ్వాంన్స్ గా పొందవచ్చు . మిగిలినది ప్రయాణం పూర్తిచేసి వచ్చి ఫైనల్ బిల్లు సమర్పించిన తరువాత చెల్లిస్తారు.

7) చెల్లించబడే మొత్తం : మొదటి రెండు సం॥లలో స్వస్థలమునకు వెళ్ళినప్పుడు గానీ, 2వ బ్లాక్ పీరియడ్లో రాష్ట్రంలోని ఏ చోటుకైనను వెళ్ళినప్పుడు గానీ పూర్తి దూరమునకు చెల్లింపు పుండును. ఇతర రాష్ట్రములలో స్వస్థలము గల వారు ఉద్యోగము చేయు స్థలం నుండి మన రాష్ట్ర సరిహద్దునకు గల దూరమునకు మాత్రమే చెల్లింపు వుంటుంది. రైలు మార్గమునుండి, ఏ ఇతర వాహనముపై ప్రయాణించినను, దగ్గరి రైలు మార్గము ద్వారా  ప్రయాణము చేస్తే అగు ఛార్జీలను (టి..నింబంధనల మేరకు) చెల్లిస్తారు. రైలు మార్గం లేనిచో బస్సు (ఆర్హతను బట్టి డీలక్స్ సర్వీసు వరకు) చార్జీలను చెల్లిస్తారు.
8) క్లెయిమ్ చేయుట : LTC మొత్తమునకు చేయునప్పుడు టి.ఎ. బిల్లునకు ఒరిజినల్ టిక్కెట్లను గానీ, క్యాష్ రశీదును గానీ, బస్సు టికెట్లుగానీ జతసరచవలెను, (ప్రస్తుత ఆన్లైన్ బుకింగ్ వల్ల పొందిన టికెట్లు గానీ, మామూలు టికెట్లుగానీ సమర్పించాలి). తిరుగు ప్రయాణం పూర్తయిన 30 రోజులలోగా డిటైల్డ్ బిల్లును అందచేయాలి. లేనిచో 15% కోత విధించబడుతుంది.
9) డ్రా చేయుటకు అకౌంట్ హెడ్ : ఉపాధ్యాయులు, ఉద్యోగులు దీనిని తమ తమ జీతములు డ్రాచేయు ఆకౌంట్ నుండి డ్రా చేయవచ్చు. ప్రొవిన్సియలైజ్ కాబడిన పంచాయితీరాజ్ ఉపాధ్యాయులు దీనిని M.H.2002 Education 3101311 Grart in Aid towards Salaries 019 LTC నుండి డ్రా చేయవచ్చు. Memo No.3118/Accts 01/A1/2002-1 PR&RD Dt: 13-11-2003.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top