Search This Blog

Monday, June 14, 2021

Earned Leaves

సంపాదిత లేక ఆర్జిత సెలవులు  (EARNED LEAVES)

ఈ సెలవుకు సంబంధించిన నిబంధనలు. నియామకాలు G.O.Ms. No. 34, Fin. Dt:27-1-1979 ఉత్తర్వులు జారీచేసియున్నారు.
@ సర్వీసుల యందు పనిచేయుచున్న ఉద్యోగులకు డ్యూటీ కాలానికి ప్రతి ఆరునెలలకు అనగా సంవత్సరంలో జనవరి నెల ఒకటప తేది నాటికి 15 రోజాల చొప్పున, అదేవిదంగా జులై  ఒకటవ తేదీన 15 రోజులు అడ్వాన్స్ గా  జమ  చేయబడుతుంది.

@ ఉపాధ్యాయులకు G.O.Ms. No. 317, Fn తేది : 15-09-1994 ప్రకారం సంవత్సరానికి  6 చొప్పున సంపాదిత సెలపులు జమచేయబడతాయి. జనవరి నెల ఒకటప తేది నాటికి 3 రోజాల చొప్పున, అదేవిదంగా జులై  ఒకటవ తేదీన 3 రోజులు అడ్వాన్స్ గా  జమ  చేయబడుతుంది.

@ రెగ్యులర్ కానీ తాత్కాలిక ఉద్యోగులకు సగం రోజులకు మాత్రమే అర్హత కలిగి ఉంటారు.

@ ఈ సెలవులు 300 రోజులకు మించి నిల్వ ఉండదు. రిటైరైనప్పుడు 300 రోజులకు మించకుండా నగదు చెలిస్తారు.        ( G.O.Ms.No.232 Dt: 16.9.2005)


వేసవిలో సంపాదిత సెలవులు

    పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.

     15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

    వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt:16-1-1981)
(G.O.Ms.No.151 Dt:14-11-2000)
(G.O.Ms.No.174 Dt:19-12-2000)

     వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt:28-4-2005)

     సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt:16-11-2013)


 వేసవి సెలవులు 49 రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:

 సూత్రం: డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు
>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు

********


Related GOs & Proc : 

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top