Search This Blog

Sunday, June 20, 2021

గురుకులాలకు పారిటీ స్కేల్స్ నిర్ణయించాలి. - టిఎస్ యుటిఎఫ్

*గురుకులాలకు పారిటీ స్కేల్స్ నిర్ణయించాలి. - టిఎస్ యుటిఎఫ్*
అన్ని యాజమాన్యాల గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు సాధారణ పాఠశాలల ఉపాధ్యాయుల వేతనస్కేళ్ళకు ఒకటి, రెండు అదనపు స్టేజీలతో పారిటీ వేతన స్కేళ్ళను నిర్ణయించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) డిమాండ్ చేస్తున్నది.
గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల జాబ్ చార్ట్ సాధారణ ఉపాధ్యాయులకు భిన్నంగా ఉంటుంది. 24 గంటలూ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. సహపాఠ్య, పాఠ్యేతర విధులను కూడా నిర్వహించాలి. ఈ పని భారాన్ని దృష్టిలో ఉంచుకునే గురుకుల పాఠశాలలు ప్రారంభించిన రోజుల్లో ఉపాధ్యాయులకు సాధారణ ఉపాధ్యాయులకంటే 2,3 ఇంక్రిమెంట్లు అదనంగా  (హయ్యర్ స్టార్ట్) ఇచ్చి వేతనాలు నిర్ణయించారు. 1993 లో మాస్టర్ స్కేల్స్ అమలు చేసిన సందర్భంలో సాధారణ ఉపాధ్యాయులకంటే ఒక స్టేజీ పై స్కేళ్ళను నిర్ణయించారు. 8వ పిఆర్సీ వరకు గురుకుల ఉపాధ్యాయులకు ఆ విధమైన పారిటీ స్కేల్స్ కొనసాగాయి.
9వ పిఆర్సీలో ఉపాధ్యాయుల వేతన స్కేళ్ళు ఇతర ఉద్యోగులకంటే రెండు, మూడు స్టేజీలు అదనంగా నిర్ణయించడంతో గురుకుల ఉపాధ్యాయులకు ఆమేరకు అదనపు స్కేల్స్ నిర్ణయించకుండా సమానమైన (కరస్పాండింగ్) స్కేల్స్ నే ఇచ్చారు.
ఉపాధ్యాయ సంఘాల వరుస ప్రాతినిధ్యాల అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల సొసైటీలో మాత్రమే ఒక అదనపు స్టేజీతో పారిటీ స్కేల్స్ నిర్ణయించారు. కానీ ఇతర సొసైటీలల్లో సాధారణ స్కేళ్ళే అమలౌతున్నాయి. తెలంగాణ మొదటి పిఆర్సీలో గరిష్ఠ వేతనాన్ని కుదించటం మూలంగా పలువురు సీనియర్ ఉపాధ్యాయుల వేతనం నిర్ణీత స్కేలులో గరిష్టానికి చేరి స్టాగ్నేషన్ ఏర్పడింది. వారంతా మూల వేతనంలో వేలాది రూపాయలు కోల్పోతున్నారు. ప్రారంభ వేతనం తక్కువగా ఉండటంచేత 1.07.2018 తర్వాత నియామకం అయిన నూతన ఉపాధ్యాయులకు కూడా నష్టం జరుగుతున్నది. అదనపు పనిభారం, తక్కువ వేతనాల కారణంగా వీరంతా టిఆర్టీ ద్వారా ఎంపికై సాధారణ పాఠశాల్లో ఉపాధ్యాయులుగా చేరిపోతున్నారు. ప్రతిభగల ఉపాధ్యాయులను గురుకుల విద్యా సంస్థలు కోల్పోతున్నాయి.
ఈ నష్టాలను నివారించాలంటే గురుకుల ఉపాధ్యాయులకు సాధారణ ఉపాధ్యాయులకు నిర్ణయించిన వేతన స్కేళ్ళను ఒకటి లేదా రెండు స్టేజీలు పెంచి (పారిటీ) వేతన స్కేళ్ళను పునరుద్దరించటం ఒక్కటే మార్గం.
ఆమేరకు గురుకుల ఉపాధ్యాయులకు పారిటీ స్కేల్స్ పునరుద్దరించాలని కోరుతూ అన్ని సొసైటీల కార్యదర్శులకు, సంబంధిత మంత్రులకు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి లేఖలు వ్రాశారు.

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top