Search This Blog

Saturday, October 24, 2020

💦🌺🌻🌸💦


*_ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనం దాన్ని చూసే గుణముండాలి, అభినందించే మంచి మనసు కలిగి ఉండాలి._*

*_జీవితంలో ఏది సులభం కాదు. ప్రయత్నిస్తే ఏది కష్టము కాదు._* 

*_డబ్బుతోను, అధికారంతోను కొనలేనిది పల్లె వాతావరణంలో  మాత్రమే దొరుకుతుంది మిత్రమా....పచ్చని పంట పొలాలు, లేలేత సూర్యకిరణాలు ఇలా... చెప్పుకుంటూ... పొతే.. ఆ పల్లెల్లో అద్భుతాలు ఎన్నో... ఎన్నోన్నో... కాదు..._* 

*_జీతం ఇచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీతం మాత్రమే పోతుంది. కానీ, జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే... మాత్రం జీవితమే పోతుంది._*

*_ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే....ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది._*

*_ఖరీదైనా వస్త్రం ధరించిన కూడా దాన్ని విడువక తప్పదు. ఎంత పంచభక్షపరమ్మన్నాం తిన్న విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారులో ఎక్కినా దాన్ని దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుపైకి వెళ్లిన తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు తిరిగిన తిరిగి నీ గూటికి రాక తప్పదు._*

*_ఎంత గొప్ప అనుభూతిని నీవు పొందిన కూడా... తిరిగి మాములు స్థితికి రాక తప్పదు... ఇదే....ఇదే.... జీవితం._*

*_అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈ రోజు నీకు బాగానే ఉంటాయి. కానీ, అవి రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి._*

*_మిత్రమా... మనః శాంతి మాత్రమే మనకు రక్ష. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ, ఓడిపోడు.  చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ, ఓడిపోతాడు._*

*_డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు కావాలి. అంతేగాని కొమ్ములు మాత్రం రాకూడదు._* 👍

        
💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

TSWREIS

TGARIEA ONLINE MEMBERSHIP

MATHS VIDEOS

EAMCET/IIT JEE /NEET CLASSES

Top