సోమవారం
అందమైన ఆదివారం తరువాత
అత్యంత బద్ధకంగా తెల్లారే వారం!
ఆదివారం ఆగిన గడియారం
యథావిధిగా తిరిగడం మొదలెట్టే వారం!
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వదిలి
కర్తవ్యం కోసం యంత్రాలయ్యే వారం!
ఇంటినీ, పిల్లల్నీ వదిలి
దూరాలకు వలసెళ్ళే అతికష్టమైన వారం!
మత్తుగా కలలుగనే లోకంలో
భళ్ళున రెప్పలు తెరుచుకునే వారం!
మెత్తటి పరుపులో దూరిన గులాబీలకు
ముల్లై గుచ్చుకునే వారం!
చల్లటి జల్లులు కురిసే సమయంలో
ఫెళఫెళమంటూ పిడుగులుపడే వారం!
నిద్రచెంపపై ఛెళ్లుమని కొట్టి
గురువై ముందుకు నడిపించే వారం!
గంటల గుణగణలు వినగానే
ఉరుకులు మొదలయ్యే వారం!
సోమరులను పరుగులెత్తించి
కొత్తగా మొలకెత్తించే సోమవారం!
- పుట్టి గిరిధర్
9491493170
అందమైన ఆదివారం తరువాత
అత్యంత బద్ధకంగా తెల్లారే వారం!
ఆదివారం ఆగిన గడియారం
యథావిధిగా తిరిగడం మొదలెట్టే వారం!
ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని వదిలి
కర్తవ్యం కోసం యంత్రాలయ్యే వారం!
ఇంటినీ, పిల్లల్నీ వదిలి
దూరాలకు వలసెళ్ళే అతికష్టమైన వారం!
మత్తుగా కలలుగనే లోకంలో
భళ్ళున రెప్పలు తెరుచుకునే వారం!
మెత్తటి పరుపులో దూరిన గులాబీలకు
ముల్లై గుచ్చుకునే వారం!
చల్లటి జల్లులు కురిసే సమయంలో
ఫెళఫెళమంటూ పిడుగులుపడే వారం!
నిద్రచెంపపై ఛెళ్లుమని కొట్టి
గురువై ముందుకు నడిపించే వారం!
గంటల గుణగణలు వినగానే
ఉరుకులు మొదలయ్యే వారం!
సోమరులను పరుగులెత్తించి
కొత్తగా మొలకెత్తించే సోమవారం!
- పుట్టి గిరిధర్
9491493170